క్లాస్‌రూమ్‌లో బర్త్ డే పార్టీ.. బీర్లు తాగుతూ ఎంజాయ్ చేసిన అమ్మాయిలు..
ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ఓ అమ్మాయి బర్త్ డే వేడుక జరిగింది. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు బీర్లు తాగి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ వాడంతో దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని డీఈవో ఏర్పాటు చేసింది. కాగా,
సోషల్ మీడియా ప్రభావంతో కొందరు విద్యార్థులు సభ్యత, సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మంచి, చెడు తేడా తెలియకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో కొందరు స్కూల్ విద్యార్థులు స్కూల్లో నిర్వహించిన బర్త్‌డే పార్టీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లాస్ రూమ్‌లో అమ్మాయిలు బీర్లు తాగి చిందులేశారు. ఈ సమయంలో ఓ విద్యార్థి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. క్రమంగా ఈ వీడియో వైరల్‌గా మారింది. విద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా చేరింది.
భట్చౌరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ఓ అమ్మాయి బర్త్ డే వేడుక జరిగింది. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు బీర్లు తాగి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ వాడంతో దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని డీఈవో ఏర్పాటు చేసింది. కాగా, వీడియో తీస్తున్నప్పుడు సరదాగా బీర్ బాటిళ్లు ఊపామని, తాము బీర్ తాగలేదని అధికారులకు బాలికలు తెలిపారు.
ఈ వీడియో చూడండి..
కాగా, ఈ సంఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులతో పాటు ప్రిన్సిపాల్‌పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకూడదని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..