Viral: ముగ్గురు భార్యలు.. నేపాల్‌లో హోటల్.. ఇండియాలో ఆస్తులు.. కట్‌చేస్తే చివరకు..
మనోడు మామూలోడు కాదు.. నేపాల్‌లో హోటల్.. ముగ్గురు భార్యలు.. వారిలో ఇద్దరు ఇండియాలో, మరొకరు నేపాల్ లో ఉంటారు. ఇంకెముంది.. అతను అఫీషల్‌గా ఇంటికి వస్తుంటాడు.. మళ్లీ పోతుంటాడు.. ఇండియాలో చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి.. పిల్లలు కూడా మంచి మంచి స్కూళ్లల్లో చదువుతున్నారు.. కానీ, ఏ ఒక్క భార్యకు కూడా అతను ఏం చేస్తాడో తెలీదు..
మనోడు మామూలోడు కాదు.. నేపాల్‌లో హోటల్.. ముగ్గురు భార్యలు.. వారిలో ఇద్దరు ఇండియాలో, మరొకరు నేపాల్ లో ఉంటారు. ఇంకెముంది.. అతను అఫీషల్‌గా ఇంటికి వస్తుంటాడు.. మళ్లీ పోతుంటాడు.. ఇండియాలో చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి.. పిల్లలు కూడా మంచి మంచి స్కూళ్లల్లో చదువుతున్నారు.. కానీ, ఏ ఒక్క భార్యకు కూడా అతను ఏం చేస్తాడో తెలీదు.. అయితే, అతను చేసే పని ఏంటంటే.. దొంగతనం.. దొంగలకు దొంగ అయిన హైఫ్రొపైల్ థీఫ్ పోలీసులకు చిక్కాడు.. కట్ చేస్తే.. విచారణలో అతను చెప్పిన విషయాలు విని.. ఢిల్లీ పోలీసులే ఆశ్చర్యపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లో హోటల్‌ను కలిగి ఉండి.. భారతదేశంలో తన పేరిట అనేక ఆస్తులు కలిగి ఉన్న ఒక ప్రముఖ దొంగను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హై ప్రొపైల్ దొంగ పేరు మనోజ్ చౌబే.. పోలీసుల విచారణలో ఇప్పటివరకు 200కి పైగా దొంగతనాలు చేశానని ఒప్పుకున్నాడు. అతనిపై దేశవ్యాప్తంగా దాదాపు 500 దొంగతనాల కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
48 ఏళ్ల వ్యక్తి అయిన మనోజ్ చౌబేకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు లక్నోలో, మరొకరు ఢిల్లీలో ఉన్నారు. అయితే ఇద్దరికీ అతను దొంగ అని తెలియదని పోలీసులు తెలిపారు. “చౌబే ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌కు చెందినవాడు.. అతను దొంగతనం చేయడానికి ఢిల్లీకి వస్తాడు. అతన్ని కరవాల్ నగర్ లో అరెస్టు చేశాం” అని వాయువ్య ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ మీనా తెలిపారు.
అతను 1997లో ఢిల్లీకి వచ్చి క్యాంటీన్‌లో దొంగతనానికి పాల్పడి మొదట పట్టుబడ్డాడని, పోష్ ఏరియాల్లోని ఇళ్లు అతని ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. దొంగిలించిన డబ్బుతో చౌబే నేపాల్‌లో హోటల్‌ను నిర్మించాడని, ఉత్తరప్రదేశ్‌లో తన భార్యలో ఒకరికి గెస్ట్‌హౌస్‌ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను అదే ప్రాంతంలో ఒక స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడనన్నారు. నెలవారీగా రూ.2 లక్షల అద్దెకు ఆసుపత్రికి లీజుకు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతనికి లక్నోలో ఇల్లు ఉందని.. అతని పిల్లలు రాజధాని నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఢిల్లీలో చౌబే, కనీసం తొమ్మిది సార్లు ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు.. కానీ ప్రతిసారీ తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సారి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా మోడల్ టౌన్ ప్రాంతంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు స్కూటర్‌పై పారిపోతున్నట్లు గుర్తించి పట్టుకున్నామన్నారు. ఈ ద్విచక్ర వాహనం నేపాల్ పౌరుడైన వినోద్ థాపాకు చెందినదని విచారణలో తేలింది. థాపాను విచారించగా, మనోజ్ చౌబే తన సోదరిని నేపాల్‌లో వివాహం చేసుకున్నట్లు తెలిపారన్నారు. కరవల్ నగర్‌లో అరెస్టు చేసిన చౌబేపై 15 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఢిల్లీ పోలీసులు దాదాపు 5,000 దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించిన వ్యక్తిని అరెస్టు చేశారు.