మతాంతర వివాహంతో మహారాష్ట్రలో దారుణం.. వరుడిని హత్య చేసి శవం నదిలో పడేసిన అమ్మాయి కుటుంబీకులు

తాజాగా ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

మతాంతర వివాహంతో మహారాష్ట్రలో దారుణం.. వరుడిని హత్య చేసి శవం నదిలో పడేసిన అమ్మాయి కుటుంబీకులు
Maharashtra News
Follow us
Surya Kala

|

Updated on: Sep 13, 2022 | 7:52 PM

Maharastra News: ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చట్టాలు తెచ్చినా నేరాలకు అడ్డు కట్టపడడం లేదు. ముఖ్యంగా ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో పెద్దలు తీసుకునే నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయి. తాజాగా ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ నగరానికి చెందిన దీపక్ బర్డే అనే హిందూ యువకుడు ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి ఫ్యామిలీ సభ్యులు దీపక్ ను కిడ్నప్ చేసి.. దారుణంగా హత్య చేశారు. హత్య చేసి అనంతరం ఆ యువకుడి మృతదేహాన్ని గోదావరి నదిలో విసిరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇప్పటి వరకు 7 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీపక్ కిడ్నప్ హత్య విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నితీష్ రాణే జనక్రోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. నివేదికల ప్రకారం.. దీపక్ గత 5 రోజులుగా కనిపించడంలేదని.. ఏకలవ్య ఆదివాసీ సమాజ్ సభ్యులు  స్థానిక పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

గతంలో రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే లవ్ జిహాద్‌పై ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెద్ద ఎత్తున ఉన్నాయని ఆరోపించారు. అమరావతిలో ఇప్పటి వరకు 20 లవ్ జిహాద్ కేసులు నమోదయ్యాయని, పెళ్లయ్యాక చాలా మంది అమ్మాయిల ఆచూకీ తెలియడం లేదని బోండే చెప్పారు. అమరావతిలోని ధరణిలో ముస్లిం యువకులు హిందూ యువతిని పెళ్లి చేసుకున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనను బొండే ప్రస్తావిస్తూ.. అమరావతి జిల్లాలో ఇలాంటి ‘లవ్ జిహాద్’ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లయిన తర్వాత చాలా సందర్భాల్లో అమ్మాయి జాడ లేదని బోండే చెప్పారు. ఆడపిల్లలను ప్రలోభపెట్టి పెళ్లి చేసుకుంటారని, వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని అన్నారని ఆరోపించారు. ముస్లిం సమాజం తమ అబ్బాయిలపై శ్రద్ధ పెట్టాలని బీజేపీ ఎంపీ కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..