AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: 100 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్‌ పాదయాత్ర.. కేరళలో కొనసాగుతున్న భారత్‌ జోడోయాత్ర

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర 100 కిలోమీటర్ల మజిలీని పూర్తి చేసుకుంది. వారం రోజులుగా రాహల్‌ పాదయాద్ర సాగుతోంది. ప్రస్తుతం కేరళలో తన పాదయాత్రను..

Bharat Jodo Yatra: 100 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్‌ పాదయాత్ర.. కేరళలో కొనసాగుతున్న భారత్‌ జోడోయాత్ర
Bharat Jodo Yatra
Subhash Goud
|

Updated on: Sep 13, 2022 | 8:50 PM

Share

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర 100 కిలోమీటర్ల మజిలీని పూర్తి చేసుకుంది. వారం రోజులుగా రాహల్‌ పాదయాద్ర సాగుతోంది. ప్రస్తుతం కేరళలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు రాహుల్‌. త్రివేండ్రం శివార్ల లోని కనియాపురంలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. వందలాదిమంది కార్యకర్తలు ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, కనీసం గొడుగు లేకుండానే రాహుల్‌ గాంధీ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో పాల్గొన్నవారి కాళ్లను బొబ్బలు వేధిస్తున్నప్పటికీ ముందుకు సాగుతున్నారు. రాహుల్‌ బృందానికి స్థానికుల నుంచి భారీ మద్దతు లభించింది. వందల సంఖ్యలో స్థానికులు వచ్చి పాదయాత్రలో పాల్గొనడం కనిపించింది. దీంతో వారిని ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్‌.. విద్వేషం, హింసతో ఎన్నికల్లో గెలవవచ్చేమో కానీ, వాటివల్ల దేశం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కారం కావని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలను పలుకరిస్తూ రాహుల్‌ గాంధీ ముందుకు సాగుతోంది. సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో మొదలైన భారత్‌ జోడో యాత్ర.. సెప్టెంబర్‌ 10 సాయంత్రం కేరళకు చేరుకుంది. రాష్ట్రంలో 19రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఏడు జిల్లాల్లో సుమారు 450 కి.మీ మేర సాగే రాహుల్‌ పాదయాత్ర.. అక్టోబర్‌ 1న కర్ణాటకలోకి ప్రవేశించనుంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మొత్తంగా 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3500కి.మీ మేర కొనసాగతుంది.

చిన్నా పెద్దా తేడా లేకుండా జనం రాహుల్‌తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు. అయితే యూపీలో రెండు రోజులు, కేరళలో 19 రోజులు భారత్‌ జోడో యాత్ర సాగడంపై సీపీఎం విమర్శించింది. ఇది భారత్‌ జోడో యాత్ర కాదని ,సీట్ల జోడో యాత్ర అని మండిపడింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఎక్కువ రోజులు పాదయాత్ర చేస్తున్నారో అర్ధం కావడం లేదని సీపీఎం విమర్శించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?