AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High speed corridor: ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌.. లోక్‌సభలో మంత్రి పీయూష్‌గోయల్‌

Hi speed corridar: ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను నిర్మించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఎంపీ...

High speed corridor: ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌.. లోక్‌సభలో మంత్రి పీయూష్‌గోయల్‌
Subhash Goud
| Edited By: |

Updated on: Mar 11, 2021 | 8:36 AM

Share

Hi speed corridar: ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను నిర్మించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఎంపీ జ్ఞానతి రవియం అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆరు కారిడార్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ముంబై నుంచి పుణె మీదుగా హైదరాబాద్‌ వరకు కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు సభలో తెలిపారు. రైల్వే శాఖ ఎంపిక చేసిన కారిడార్ల డీపీఆర్‌లు రూపొందిస్తుందని ఆయన అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా కొత్తగా ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. అయితే ఎంపిక చేసిన ఏడు కొత్త హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు భారతీయ రైల్వేకు బాధ్యతలు అప్పగించామన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ కారిడార్‌ డీపీఆర్‌ పూర్తి కాలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. డీపీఆర్‌లోని అంశాల ఆధారంగా ఒక్కో కారిడార్‌కు ఆమోదం తెలుపుతామన్నారు.

కాగా, గతంలోనే దేశంలో మూడు ప్రాంతాలకు పారిశ్రామిక కారిడార్లు నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తెలంగాణలో 2,398 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ అభివృద్ధికి ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రైల్వేబోర్డు ఛైర్మన్‌ గతంలో విడుదల చేశారు. అయితే ప్రణాళిక(రూ.38,20,516 కోట్ల వ్యయ అంచనా) ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 11 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అందులో హైదరాబాద్‌-నాగ్‌పుర్‌, హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్లు ఉన్నాయి. తాగా మంత్రి ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు.

దేశంలో మరో 8 సైనిక స్కూళ్లు :

కాగా, దేశంలో మరో 8 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, దేశంలో మొత్తం 33 సైనిక స్కూళ్లు ఉన్నాయని సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క సైనిక స్కూల్‌ లేకపోవడం, వరంగల్‌ జిల్లాలో సైనిక స్కూల్‌ ఏర్పాటుకు రక్షణ శాఖ 2017 మార్చి 2న సూత్రప్రాయ ఆమోదం తెలిపి, ఒప్పందం చేసుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నకు సభలో మంత్రి సమాధానం ఇచ్చారు.

ఇవి చదవండి :

Onion Price Reduced: దిగి వస్తున్న ఉల్లిపాయ ధర.. ఏడు రోజుల్లో 21 రూపాయలు తగ్గిన ఉల్లి

Petrol Price Today : సామాన్యుడికి కాస్త ఉపశమనం .. ఇంధన ధరలకు బ్రేకులు.. దేశీయంగా ధరలు ఇలా ఉన్నాయి.

Parliament: ఈ రోజూ అదే తీరు.. ఆందోళనలతో అట్టుడికిన పార్లమెంట్.. ఉభయ సభలు మార్చి 15 వరకు వాయిదా