హాథ్రస్ బాధితురాలపై అవాకులు చవాకులు పేలిన బీజేపీ నేత
ఒకరేమో హాథ్రాస్ నిందితుల రక్షణ కోసం సభలు సమావేశాలు పెడతారు. మరొకరేమో అమ్మాయిలకు తల్లిదండ్రులు విలువలు నేర్పితే అత్యాచారాలు జరగవంటారు. ఇంకొకరేమో బాధితురాలిపై అవాకులు చవాకులు పేలతారు.
ఒకరేమో హాథ్రాస్ నిందితుల రక్షణ కోసం సభలు సమావేశాలు పెడతారు. మరొకరేమో అమ్మాయిలకు తల్లిదండ్రులు విలువలు నేర్పితే అత్యాచారాలు జరగవంటారు. ఇంకొకరేమో బాధితురాలిపై అవాకులు చవాకులు పేలతారు. ఉత్తరప్రదేశ్‌లోని బారబంకీకి చెందిన బీజేపీ నాయకుడు రంజిత్ బహదూర్ శ్రీవాత్సవ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. హాథ్రస్‌లో తీవ్ర హింసల మధ్య అత్యాచారానికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కన్నుమూసిన అమ్మాయికి సద్గుణాలు లేవన్నారు.. పచ్చి తిరుగుబోతంటూ కామెంట్ చేశారు. నిందితులంటున్నవారిలో ఒకరితో ఆమె ప్రేమ వ్యవహారం కూడా నడిపిందన్నారు. అలాంటి అమ్మాయిల మృతదేహాలు కొన్ని ప్రదేశాల్లోనే కనిపిస్తాయని చెప్పుకొచ్చారు.. చెరకుతోటల్లోనో, మొక్కజొన్న చేనులోనో, దట్టమైన పొదల్లోనో, చిక్కటి అడవుల్లోనో శవాలు కనిపిస్తాయే తప్ప, వరి చేలల్లో ఎందుకు కనిపించవంటూ తర్కరహితంగా మాట్లాడారాయన! శ్రీవాత్సవ మాటలతో ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలలో వైరల్ అవుతోంది.. అమ్మాయి అఫైర్ సంగతి తెలిసే ఆమె కుటుంబసభ్యులు ఆమెను చంపేసి ఉంటారని అన్నారు. అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని చెప్పారు.. నిందితులంతా సుద్దపూసలని స్టేట్‌మెంట్ ఇచ్చారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు.. వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ శ్రీవాత్సవ వకాల్తా పుచ్చుకున్నారు.