ప్రధాని మోదీ సరికొత్త రికార్డ్, పాలకుడిగా 20 ఏళ్ల ప్రస్థానం

పలు విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఆయన నేటితో 20 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేస్తున్నారు.

ప్రధాని మోదీ సరికొత్త రికార్డ్, పాలకుడిగా 20 ఏళ్ల ప్రస్థానం
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 07, 2020 | 1:28 PM

పలు విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఆయన నేటితో 20 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేస్తున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అక్టోబరు 7, 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. అలా వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తిరుగులేని నేతగా చక్రం తిప్పుతున్నారు. తాను ఫ్రంట్ ఫేస్‌గా ఉంటూ  బీజేపీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. కమల దళంలో నూతనోత్తేజాన్ని నింపారు.  2014, 2019లో ప్రధానిగా వరుసగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అలా 2001 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాధినేతగా..పాలకుడిగా నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా మోదీ పాలనలో తన మార్క్ చూపించారు…చూపిస్తున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ తీసుకున్న కీలక నిర్ణయాలు :

  • విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టడం
  • ప్రతి మారుమూల గ్రామానికి.. ప్రతి ఇంటికీ.. విద్యుత్‌
  • భారీగా పెట్టుబడుల ఆకర్షణ
  • బాలిక విద్యను ప్రోత్సహించడం (కన్యా కెలవానీ ప్రోగ్రాం)

భారత ప్రధాన మంత్రిగా మోదీ తీసుకున్న కీలక నిర్ణయాలు :

  • పెద్ద నోట్ల రద్దు
  • జీఎస్టీ
  •  ఆయుష్మాన్ భారత్ పథకం
  •  ఈబీసీ రిజర్వేషన్లు
  • బేటీ పడావో-బేటీ బచావో
  • సర్జికల్ స్ట్రైక్స్
  • స్వచ్ఛ భారత్
  • మేకిన్ ఇండియా
  • ట్రిపుల్ తలాక్ రద్దు
  • ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA)
  • వన్ నేషన్-వన్ రేషన్
  • కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు

Also Read : రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి