మొండెం పార్కులో.. తల చెరువులో.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన కృత్రిమ కాలు..!
హర్యానాలోని కురుక్షేత్రలో దివ్యాంగుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేశవ్ పార్క్‌లో వికలాంగుడైన సునీల్ తల లేని మొండెంతో కనిపించా. అతని కృత్రిమ కాలు ద్వారా పానిపట్ ప్రాంతానికి చెందిన సునీల్‌గా గుర్తించారు. సునీల్ భార్య, ఆమె ప్రియుడు ఈ హత్య వెనుక ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు.

హర్యానాలోని కురుక్షేత్రలో దివ్యాంగుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేశవ్ పార్క్‌లో వికలాంగుడైన సునీల్ తల లేని మొండెంతో కనిపించా. అతని కృత్రిమ కాలు ద్వారా పానిపట్ ప్రాంతానికి చెందిన సునీల్‌గా గుర్తించారు. సునీల్ భార్య, ఆమె ప్రియుడు ఈ హత్య వెనుక ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కథనం ప్రకారం, డిసెంబర్ 30, 2025 ఉదయం, కేశవ్ పార్క్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తి పార్కులో రక్తపు మడుగులో తల లేని శరీరం పడి ఉండటాన్ని చూశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రక్తపు మరకలున్న కత్తి, మృతుడి కుడి కృత్రిమ కాలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ తల కనిపించకపోవడంతో మృతదేహాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది.
దాదాపు 15 రోజుల తర్వాత, జనవరి 13, 2026న, పార్క్ నుండి అర కిలోమీటరు దూరంలో ఉన్న ఒక చెరువులో ఒక మానవ తల బయటపడింది. తల, మొండెం ఒకే వ్యక్తికి చెందినవని DNA పరీక్షలో నిర్ధారణ అయ్యింది. దీంతో జైపూర్‌కు చెందిన ఒక కంపెనీ గుర్తును కలిగి ఉన్న మృతుడి కృత్రిమ కాలును గుర్తించడానికి పోలీసులకు ప్రధాన ఆధారం లభించింది. దీని ఆధారంగా, దర్యాప్తు కొనసాగింది.
హర్యానాలో ఆ కంపెనీతో సంబంధం ఉన్న దాదాపు 150 మంది వికలాంగుల జాబితాను పోలీసులు సమీక్షించారు. దర్యాప్తులో భాగంగా ఆ బృందం పానిపట్‌లోని ఖోజ్‌కిపూర్ గ్రామానికి వెళ్లింది. అక్కడ సునీల్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఛాయాచిత్రాల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు. సునీల్ వివాహితుడు, ఇద్దరు చిన్న పిల్లల తండ్రి. అతని భార్య సీత జనవరి 4వ తేదీ నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.
దర్యాప్తులో సునీల్ భార్య సీత, మోహిత్ అనే యువకుడితో గత ఏడాది కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని తేలింది. సునీల్ తాగుడుకు బానిసై తన భార్యను తరచుగా కొడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని సీత తన ప్రియుడు మోహిత్‌కు ఫిర్యాదు చేయడంతో.. మోహిత్‌కు సునీల్‌పై ఉన్న ద్వేషం మరింత పెరిగిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఘాతుకానికి పాల్పడనట్టు వెల్లడించారు.
డిసెంబర్ 25 నుండి హత్య కుట్ర జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. డిసెంబర్ 29న, మోహిత్, అతని స్నేహితుడు మంజీత్, మంజీత్ సోదరుడు అంకుష్ సునీల్‌ను రైలులో కురుక్షేత్రకు తీసుకెళ్లారు. ఒక హోటల్‌లో చెక్ ఇన్ చేసిన తర్వాత, వాకింగ్‌కు తీసుకెళ్తానని చెప్పి కేశవ్ పార్క్‌కు తీసుకెళ్లారు. చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపారు. గుర్తింపును దాచడానికి, అతని తలను నరికి సమీపంలోని చెరువులో పడవేసి, అతని మొండెం పార్కులోనే వదిలేశారు.
హత్య తర్వాత, మోహిత్ సీతకు తన రహస్య సమాచారాన్ని అందించాడు. ఆమె ఆదేశం మేరకు, ఏం జరగనట్లు తప్పిపోయిన వ్యక్తిగా ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో మోహిత్, మంజీత్, సీతను అరెస్టు చేసి జైలుకు పంపారు. నాల్గవ నిందితుడు అంకుష్ కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
