Happy Republic Day Wishes: మీ స్నేహితులు, సన్నిహితులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇలా తెలియజేయండి..!

భరత మాత కోసం.. భావితరాల భవిష్యత్ కోసం మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు. అందరికీ వందనాలు. 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ స్నేహితులు, సన్నిహితులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..!

  • Surya Kala
  • Publish Date - 12:37 pm, Tue, 26 January 21
Happy Republic Day Wishes:  మీ స్నేహితులు, సన్నిహితులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇలా తెలియజేయండి..!

Happy Republic Day Wishes: ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం.. బ్రిటిష్ వారి పరిపాలన నుంచి ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చింది. అప్పటి వరకూ బ్రిటిష్ రాజ్యాంగం అమలులో ఉండేది.. దీంతో మనకంటూ ఓ ప్రత్యేక రాజ్యాంగం అవసరమని 1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రెండు సంవత్సరాల 11 నెలల, 18 రోజుల కాలంలో రాజ్యాంగ రచన పూర్తి చేసింది. 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.అనంతరం మన రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.అప్పటి నుంచి ఆరోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ సారి కరోనా నేపథ్యంలో నిబంధనల మధ్య రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి. .

భరత మాత కోసం.. భావితరాల భవిష్యత్ కోసం మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు. అందరికీ వందనాలు. 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ స్నేహితులు, సన్నిహితులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..!

‘వందేమాతరం.. వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
అమరం మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం
శాశ్వతం మా మువ్వన్నెల పతాకం
చరితార్థం మా భారతావని భవితవ్యం వందేమాతరం.. వందేమాతరం..
భారతీయతే మా నినాదం.. ‘ హ్యాపీ రిపబ్లిక్ డే

సమరయోధుల పోరాట బలం… అమర వీరుల త్యాగఫలం..
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన గణతంత్ర దినోత్సవం..
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందిన దినం .. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. బహు గొప్పదైన జెండా
అంధకారం పోగొట్టి.. మనలో ఆశలు రేపిన జెండా మిత్రులందరికీ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జాతులు వేరైనా, భాషలు వేరైనా… మనమంతా ఒక్కటే..
కులాలు వేరైనా, మతాలు వేరైనా… మనమంతా భారతీయులం..
హ్యాపీ రిపబ్లిక్ డే

‘నేను భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను..
సదా నేను భారతమాతకు రుణపడి ఉంటాను..
భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు.., హ్యాపీ రిపబ్లిక్ డే

‘దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే
ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ..
వందేమాతరం.. అందాం మనమందరం..’ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Also Read: దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం‌ను బాలు కంటే ముందు అందుకున్న సినీ కళాకారులు ఎవరో తెలుసా..!