Guwahati MPR: గువాహటి జీఎంసీ ఎన్నికల్లో బీజేపీ కూటమి దూకుడు.. 58 వార్డుల్లో విజయభేరి

గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ (JMC) ఎన్నికల్లో బీజేపీ జెండా(BJP) ఎగురవేసింది. మొత్తం 60 సీట్లలో 58 సీట్లు బీజేపీ, దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ (AGP)కి దక్కాయి. ఇక్కడ కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు.

Guwahati MPR: గువాహటి జీఎంసీ ఎన్నికల్లో బీజేపీ కూటమి దూకుడు..  58 వార్డుల్లో విజయభేరి
Guwahati Municipal Corporat
Follow us

|

Updated on: Apr 24, 2022 | 10:32 PM

గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ (JMC) ఎన్నికల్లో బీజేపీ జెండా(BJP) ఎగురవేసింది. మొత్తం 60 సీట్లలో 58 సీట్లు బీజేపీ, దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ (AGP)కి దక్కాయి. ఇక్కడ కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అసోమ్ జాతీయ పరిషత్ (ఏజేపీ)లకు ఒక్కో సీటు లభించింది. ఈ చారిత్రాత్మక విజయంతో బీజేపీ కార్యకర్తల్లో సంబరాల వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. బీజేపీ 53 వార్డుల్లో పోటీకి నిలబడగా, కాంగ్రెస్ 55 వార్డుల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ 39 వార్డుల్లో పోటీచేసి ఒక వార్డు దక్కించుకోవడం ద్వారా గౌహతిలో అడుగుపెట్టింది.

బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంపై అసోం ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ, “ధన్యవాదాలు గౌహతి! ఈ సుందరమైన నగర ప్రజలు అద్భుతమైన ఆదేశాన్ని ఇచ్చారు. అసోంలో బీజేపీ అభివృద్ధే అజెండాగా పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రజలు కూడా ఆశీర్వదించారు. కష్టపడి పనిచేస్తున్న ప్రతి బీజేపీ కార్యకర్తకు నా కృతజ్ఞతలు.

జీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రాలకు చారిత్రక విజయం కట్టబెట్టిన ప్రజలకు తాను శిరసువంచి అభివాదం తెలియజేస్తున్నానని ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ ట్వీట్ చేశారు. జీఎంసీ ఎన్నికల్లో విజయంపై ప్రధాన మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. గత నెలలో రాష్ట్ర మున్సిపల్ బోర్డులకు జరిపిన ఎన్నికల్లోనూ బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు ఇదే తరహా విజయం సాధించారు. కాగా, జీఎంసీకి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించారు. 2013లో చివరిసారిగా ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, 2016లో బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2021లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.