Gujarat floods: గుజరాత్‌లో వరదలు విధ్వంసం.. 48 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో తుఫాన్.. అస్నాగా పేరు పెట్టిన పాక్

గుజరాత్‌లో క్రమంగా పెరుగుతున్న అల్పపీడనం ప్రభావం శుక్రవారం కచ్ నుంచి పాకిస్తాన్ తీర ప్రాంతాల్లో తుఫాన్ గా రూపాంతరం చెందిందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. IMD ప్రకారం ఈ తుఫాన్ ప్రభావంతో గాలి వేగం అత్యధికంగా ఉంటుందని.. గాలి వేగం గంటకు 63 కిమీ నుండి 87 కిమీ వరకు ఉంటుందని వెల్లడించింది.

Gujarat floods: గుజరాత్‌లో వరదలు విధ్వంసం.. 48 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో తుఫాన్.. అస్నాగా పేరు పెట్టిన పాక్
Gujarat Floods
Follow us

|

Updated on: Aug 31, 2024 | 6:55 PM

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గుజరాజ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్ తీవ్ర వరదలను ఎదుర్కొంటోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 1200 మందికి పైగా ప్రజలను రక్షించగా, 18 వేల మందిని పైగా వరద ప్రాంతాల నుంచి వరద ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అల్పపీడనం కారణంగా గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. తూర్పు-మధ్య గుజరాత్‌లో 105 శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. ఉత్తర గుజరాత్‌లో సగటున 87 శాతం వర్షపాతం నమోదైంది. అయితే కచ్‌లో అత్యధికంగా 177 శాతం వర్షపాతం నమోదైంది. సౌరాష్ట్రలో 124 శాతానికి పైగా, దక్షిణ గుజరాత్‌లో 111 శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. ఈ అల్పపీడనం కచ్ , సౌరాష్ట్ర మీదుగా వెళుతున్నందున ఈ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.

మొదట బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత రాజస్థాన్‌కు చేరుకుని తీవ్ర అల్పపీడనంగా మారింది. అక్కడ నుంచి గుజరాత్ మీదుగా చాలా నెమ్మదిగా కదులుతోంది. దీనితో పాటు అరేబియా సముద్రం నుంచి తేమ కూడా ఎక్కువగా ఉంది. అందుకే గుజరాత్‌లోని చాలా ప్రాంతాలు చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పాకిస్థాన్ వైపు మళ్లిన తుపాను

గుజరాత్‌లో క్రమంగా పెరుగుతున్న అల్పపీడనం ప్రభావం శుక్రవారం కచ్ నుంచి పాకిస్తాన్ తీర ప్రాంతాల్లో తుఫాన్ గా రూపాంతరం చెందిందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. IMD ప్రకారం ఈ తుఫాన్ ప్రభావంతో గాలి వేగం అత్యధికంగా ఉంటుందని.. గాలి వేగం గంటకు 63 కిమీ నుండి 87 కిమీ వరకు ఉంటుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ తుఫాను శనివారం (ఆగస్టు 31) గుజరాత్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు తుఫాన్ ప్రమాదం తప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ పూర్తిగా పాకిస్థాన్ వైపు మళ్లింది. అయితే ఇప్పటికీ సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాన్‌కు పాకిస్థాన్ అస్నా అని పేరు పెట్టింది.

1976 తర్వాత ఆగస్టులో తొలి తుఫాను

1976 అంటే 48 ఏళ్ల తర్వాత ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను అస్నా అని IMD తెలిపింది. గతంలో 1976లో ఇలాంటి తుఫాను గుజరాత్‌ను తాకింది. 48 ఏళ్ల తర్వాత మరోసారి భూమి నుంచి సముద్రంలోపలికి వెళ్లింది. 1891, 2023 మధ్య, 1944, 1964, 1976 సంవత్సరాల్లో ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో కేవలం మూడు తుఫానులు మాత్రమే సంభవించాయని IMD తెలిపింది.

1944లో అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడింది. దీని తరువాత 1964 సంవత్సరంలో దక్షిణ గుజరాత్ తీరానికి సమీపంలో మరొక తుఫాను ఏర్పడింది. అయితే ఇది చాలా తక్కువ సమయం పాటు కొనసాగింది. తీరానికి సమీపంలోకి వచ్చిన తర్వాత తుఫాన్ బలహీనపడింది. ఆ తర్వాత 1976లో ఒడిశా నుంచి మొదలైన తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అరేబియా సముద్రాన్ని చేరుకుంది. ఒమన్ తీరానికి సమీపంలో వాయువ్య అరేబియా సముద్రంలో ఇది బలహీనపడింది.

తుఫాను ఇలా ముందుకు సాగి పాకిస్థాన్‌ను తాకింది

ఈ తీవ్ర అల్పపీడనం ఆగస్టు 29 ఉదయం అరేబియా సముద్రానికి చేరుకుంటుందని ముందుగా అంచనా వేసినట్లు IMD తెలిపింది. అయితే ఆగస్ట్ 28 రాత్రి సమయంలో వేగం నెమ్మదించింది. ఆరు గంటల్లో కేవలం మూడు కి.మీ. పయనించడంతో ఆగస్టు 30న అరేబియా సముద్రాన్ని చేరుకుని తుఫాన్‌గా మారింది. దీని తరువాత తుఫాన్ మరో రెండు రోజులు కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఆగస్టు 31 న ఈ అస్నా తుఫాన్ గుజరాత్ తీరానికి దూరంగా అరేబియా సముద్రంలో పాకిస్తాన్ వైపు కదిలిందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్