AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దృశ్యం సినిమాను తలపించేలా.. ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. ఎక్కడ దాచిపెట్టిందో తెలిస్తే..!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు ఏడాది క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు. ఒక మహిళ, తన ప్రేమికుడు, అతని స్నేహితులతో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రహస్యంగా దాచిపెట్టారు. అచ్చం దృశ్యం సినిమాలో లాగా చిత్రీకరించి తప్పించుకుని తిరుగుతున్నారు. ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దృశ్యం సినిమాను తలపించేలా.. ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. ఎక్కడ దాచిపెట్టిందో తెలిస్తే..!
Ahmedabad Murder Case
Balaraju Goud
|

Updated on: Nov 06, 2025 | 9:49 AM

Share

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు ఏడాది క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు. ఒక మహిళ, తన ప్రేమికుడు, అతని స్నేహితులతో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రహస్యంగా దాచిపెట్టారు. అచ్చం దృశ్యం సినిమాలో లాగా చిత్రీకరించి తప్పించుకుని తిరుగుతున్నారు. ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తప్పిపోయిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకులాట కొనసాగించారు. కానీ హత్య చాలా చాకచక్యంగా జరిగిందని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తిరిగి పొందడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది.

అహ్మదాబాద్ నగరానికి చెందిన సమీర్ అన్సారీ (35) 2024 లో అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అతని కోసం ఒక సంవత్సరం పాటు గాలింపు చర్యలు చేపట్టినా, అతని జాడ దొరకలేదు. అయితే సమీర్ అన్సారీతో రూబీకి వివాహం అయ్యింది. రూబీ ఆమె భర్త సమీర్ తరచుగా గొడవ పడుతుండేవారు. ఇమ్రాన్ తో రూబీకి ఉన్న అక్రమ సంబంధం కారణంగా ఈ వివాదం తలెత్తింది. చివరికి అన్సారీని దారుణంగా హత్య చేసేందుకు దారితీసింది. మూడు నెలల క్రితం మిస్సింగ్ కేసు క్రైమ్ బ్రాంచ్ కు చేరినప్పుడు, పోలీసులు సమీర్ హత్యగా అనుమానించారు.

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీర్ మొబైల్ ఫోన్ 14 నెలలుగా స్విచ్ ఆఫ్‌లో ఉంది. అతను స్నేహితులను గానీ, బంధువులను సంప్రదించలేదు. ఈ వివరాల ఆధారంగా, పోలీసులు ఇమ్రాన్‌ను పట్టుకున్నారు. అతని విచారణలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. అన్సారీని హత్య చేసి, మృతదేహాన్ని దాచిపెట్టినట్లు అచ్చం సినిమా కథ బయటపడింది. “దృశ్యం” చిత్రం లాగే, భార్య రూబీ, తన ప్రియుడు, అతని ఇద్దరు స్నేహితులతో కలిసి మొదట తన భర్త సమీర్‌ అన్సారీని హత్య చేసి, ఆపై మృతదేహాన్ని క్రమపద్ధతిలో దాచిపెట్టింది.

హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడానికి చాలా పక్కాగా సూక్ష్మంగా ప్లాన్ చేశారు. ఒక సంవత్సరం తర్వాత కూడా పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోలీసులు రూబీని అనుమానించారు. కానీ ఆమె చర్యలకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. రూబీ తన భర్తను హత్య చేసి, తన ప్రేమికుడు, అతని స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని ముక్కలు చేసింది. ఆ తర్వాత ఆమె తన వంటగదిలోని టైల్స్ నేల కింద మృతదేహాన్ని పాతిపెట్టింది. చివరికి ఆమె ప్రేమికుడు పోలీసుల ముందు నేరం ఒప్పుకోవడంతో అసలు యవ్వారం బయటపడింది. ఈ తర్వాత, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇంట్లో నుండి అస్థిపంజర అవశేషాలను స్వాధీనం చేసుకుంది.

పోలీసుల విచారణలో నిందితుడు ఇమ్రాన్ నేరం అంగీకరించాడు. రూబీ హత్యకు ప్లాన్ చేసిందని అతను పోలీసులకు చెప్పాడు. వారు మొదట సమీర్‌ను కట్టివేసి, ఆపై కత్తితో పొడిచి చంపారు. అంతేకాకుండా, అతని మృతదేహాన్ని ముక్కలు చేసి, అవశేషాలను వంటగది నేల కింద పాతిపెట్టారు. ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం మీరట్‌లో ఇలాంటి కేసు జరిగింది, అక్కడ భార్య ముస్కాన్, ఆమె ప్రియుడితో కలిసి తన భర్త సౌరభ్‌ను హత్య చేసి, అతని మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిపెట్టింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..