ఫస్ట్ నైట్ రోజే వరుడు మిస్సింగ్.. భార్య కోరిక తీర్చడానికి వెళ్లి తిరిగిరాని మోను.. అసలు ఏం జరిగిందంటే..?
మీరట్‌లో ఫస్ట్ నైట్ రోజే వరుడు మొహ్సిన్ అదృశ్యమవడం కలకలం రేపింది. భార్య కోరిక తీర్చడానికి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. నాలుగు రోజులైనా ఆచూకీ లేకపోవడంతో ఆ కుటుంబానికి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని క్షణం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఒక సంఘటన ఓ నవ వధువుకు, కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. పెళ్లైన మొదటి రాత్రి వరుడు మొహ్సిన్ అలియాస్ మోను అర్ధరాత్రి అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలం రేపింది. మీరట్‌లోని సర్ధన పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా ఉంచాపూర్ ప్రాంతానికి చెందిన మొహ్సిన్ అలియాస్ మోను.. ఖతౌలికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అన్ని పెళ్లి ఆచారాలు ముగిసిన తర్వాత మోను తన భార్యతో కలిసి ఉంచాపూర్‌లోని తన గ్రామానికి చేరుకున్నాడు.
అది వారి పెళ్లి తొలి రాత్రి. గదిలో ఎక్కువ వెలుతురు ఉండటంతో వధువు ఇబ్బంది పడింది. ఎక్కువ వెలుతురు వల్ల స్పష్టంగా చూడలేకపోతున్నానని.. తన కళ్లకు ఇబ్బంది కలుగుతోందని వెంటనే చిన్న బల్బు పెట్టాలని వధువు కోరింది. దీంతో భార్య కోరిక తీర్చేందుకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మొహ్సిన్ తన ఇంటి నుం బయలకు వెళ్లాడు. కానీ ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు.
నాలుగు రోజులు గడిచినా ఆచూకీ లేదు
వరుడు కనిపించకపోవడంతో అప్పటివరకు ఆనందంతో నిండిన ఆ ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట్లో ఏదో పని మీద బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు భావించినా, రాత్రంతా తిరిగి రాకపోవడంతో ఆందోళన మొదలైంది. నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు మోను ఆచూకీ లభించలేదు. మోను సిస్టర్స్ వివాహాలు కూడా జరగాల్సి ఉంది. వారి సోదరుడు కనిపించకుండా పోవడంతో బరువెక్కిన హృదయంతో వారు పెళ్లి ఏర్పాట్లను పూర్తి చేయాల్సి వచ్చింది.
సీసీటీవీ ఫుటేజీలో కీలకాంశాలు
మోను ఆకస్మిక అదృశ్యం కేసును పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో మొహ్సిన్ చివరిసారిగా గంగానగర్ వద్దకు చేరుకుంటున్నట్లు కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు గంగానగర్ ప్రాంతంలో ముఖ్యంగా నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ‘‘తాము అన్ని అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఆధారాలు సేకరిస్తున్నామని, తప్పిపోయిన వరుడి గురించి కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ షాకింగ్ సంఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








