AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాళి కట్టిన మూడు సెకన్లకు గుండెపోటుతో పెళ్లికొడుకు మృతి! కన్నీళ్లు పెట్టిస్తున్న విషాద ఘటన

కర్ణాటకలోని జమఖండి గ్రామంలో జరిగిన విషాద ఘటనలో, తాళి కట్టిన మూడు సెకన్ల తర్వాత గుండెపోటుతో పెళ్లి కొడుకు ప్రవీణ్ మృతి చెందాడు. అతని పెళ్లిని ఘనంగా జరుపుకున్నారు, కానీ ఈ విషాదం అందరినీ కుదిపేసింది. ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు శోకానికి నిదర్శనంగా మారాయి. 26 ఏళ్ల ప్రవీణ్‌ అకాల మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది.

తాళి కట్టిన మూడు సెకన్లకు గుండెపోటుతో పెళ్లికొడుకు మృతి! కన్నీళ్లు పెట్టిస్తున్న విషాద ఘటన
Groom Dies Heart Attack
SN Pasha
|

Updated on: May 17, 2025 | 7:49 PM

Share

రెండు జీవితాలను ఒకటి చేసే పెళ్లి మండపానికి మన పురాణాల్లో ఓ ప్రత్యేక స్థానముంది. అందరి సంస్కృతి, సాంప్రదాయాలు ఒకేలా లేకపోయినా.. ఇద్దరూ వ్యక్తులను కలిపే పెళ్లిమండపం మాత్రం ఎవరికైనా పవిత్రమే. అలాంటి మండపంపై ఎవ్వరూ ఊహించని ఘటన జరిగింది..! కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం.. మా పెళ్లికి ఇంకా వారం రోజులే ఉందంటూ వధూవరులు.. 7days to Go అని సోషల్‌ మీడియాలో సంతోషంతో పోస్టు కూడా పెట్టారు. ఇక ఆ తర్వాత ఏమైంది? అనుకున్నట్లుగానే ఇద్దరి పెళ్లి జరిగిందా? మూడుముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారా? అంటే.. లేదు. అలా జరగలేదు. ఇన్విటేషన్‌ పోస్టర్‌లు, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు చూసి ఆ దేవుడికే కన్ను కుట్టిందేమో! పెళ్లి మండపంలో ఘోరం జరిగింది.

కొన్ని క్షణాల్లోనే అంతా మారిపోయింది. ఆనందానికి మారుపేరైన పెళ్లి వేడుక, మృత్యువు పరవశించిన విషాద ఘట్టమైంది. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ వధువు సంతోషం తాళి కట్టిన క్షణాల్లోనే ఆవిరైపోయింది. తాళి కట్టిన మూడు సెకన్ల తర్వాత పెళ్లి కొడుకు ప్రవీణ్‌ కుప్పకూలిపోయాడు. హుటాహుటినా అంబులెన్స్‌ను పిలిపించారు. వైద్యులు చూసి.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో చనిపోయాడని తెలిపారు. అంతే అక్కడున్న వారి గుండె ముక్కలైంది. ఆ పెళ్లికూతురిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇటు ప్రవీణ్‌ కుటుంబ సభ్యులు సైతం గుండెలు బాదుకుంటూ ఏడవడంతో అక్కడున్న వారందరి కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. గుండెలు పిండేసే ఈ విషాద ఘటన కర్ణాటకలోని జమఖండి గ్రామంలో చోటు చేసుకుంది.

మొదటి నుంచి తన పెళ్లిని ఎంతో ఘనంగా ప్లాన్‌ చేసుకున్నాడు ప్రవీణ్‌. పెళ్లికి సంబంధించిన ప్రతి అకేషన్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. జీవితంలో ఒక్కసారే వచ్చే వేడుక కావడంతో ప్రీ-వెడ్డింగ్‌ షూట్‌ కూడా చేసుకున్నారు. ఇప్పుడీ ప్రీ-వెడ్డింగ్‌ వీడియో ఇద్దరి కుటుంబాల్లో శోకాన్ని మరింత పెంచింది. ఈ వీడియో చూస్తూ గుండెలవిసేలా రోధిస్తున్నారు బంధువులు. ఎంతో జీవితం ఉన్న ప్రవీణ్‌ 26 సంవత్సరాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో జమఖండి గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఇప్పుడీ వార్త కర్ణాటకలో చర్చనీయాంశమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..