చిన్నారి చిరు కోరిక.. క్లాస్ రూం దిగొచ్చిన వేళ.. విషయం తెలిస్తే ఫిదా అవడం పక్కా
అక్షరాస్యతలో ఎప్పుడూ కేరళ(Kerala) రాష్ట్రమే ఎందుకు అగ్రస్థానంలో నిలుస్తుందో తెలిపే సంఘటన ఇది. విద్యకు ఆ రాష్ట్రం ఇస్తున్న ప్రోత్సాహం చూస్తే..ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అరుదైన వ్యాధితో బాధపడుతున్న...
అక్షరాస్యతలో ఎప్పుడూ కేరళ(Kerala) రాష్ట్రమే ఎందుకు అగ్రస్థానంలో నిలుస్తుందో తెలిపే సంఘటన ఇది. విద్యకు ఆ రాష్ట్రం ఇస్తున్న ప్రోత్సాహం చూస్తే..ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి తనకు చదువుకోవాలనే కోరిక ఉందని తెలిపింది. ఆమె కోరికను మన్నించిన తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నడవలేక వీల్ ఛైర్ కే పరిమితమైన ఆ విద్యార్థి కోసం రెండో అంతస్తులో ఉండే తరగతి గదిని కిందికి మార్చారు. అంతే కాకుండా ఆమె వచ్చేందుకు వీలుగా రోప్ నిర్మించారు. పాఠశాలకు వచ్చిన తొలి రోజును పండుగలా నిర్వహించారు. తోటి విద్యార్థులు ఆమెకు బహుమతులు(Gifts) ఇచ్చి ప్రోత్సహించారు. ఆమెతో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు.
కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా కల్లార్లో ఓ చిన్నారి సెరెబ్రిల్ పాల్సీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. అరుదైన వ్యాధి కారణంగా ఐదేళ్ల పాటు ఆ చిన్నారి చదువుకు దూరం కావాల్సి వచ్చింది. అందరు పిల్లల లాగే తనకూ బడికి వెళ్లి చదువుకోవాలని కోరుకునేది. తన కోరికను అమ్మానాన్నలకు తెలిపింది. కూతురు కోరిక మేరకు బాలిక తల్లిదండ్రులు కల్లార్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. అక్కడి సిబ్బందికి విషయం వివరించారు. వీరి విన్నపానికి వారు సానుకూలంగా స్పందించారు. చిన్నారి క్లాస్ రూంలోకి వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సులభంగా తరగతి గదిలోకి వెళ్లేలా.. రెండో అంతస్తులో ఉన్న ఆరో తరగతిని గ్రౌండ్ ఫ్లోర్‌కు మార్చారు. వీల్ ఛైర్ వచ్చేందుకు వీలుగా రోప్ఏర్పాటు చేశారు.
అంతే కాకుండా ఆమెకు ఎప్పటికీ గుర్తుండి పోయేలా.. తోటి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. బాలిక రాక కోసం తరగతి గదిని అందంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల బెలూన్లతో క్లాస్‌రూంను అలంకరించారు. చదువుకునేందుకు అనారోగ్యం అడ్డు కాదని నిరూపించిన చిన్నారి సెరా కు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు. పుష్పగుచ్ఛాలు, బహుమతులు ఇచ్చారు. అంతే కాకుండా సెరా తో కేక్కట్చేయించారు.
Also Read
Mahaan Movie: చియాన్ విక్రమ్ యాక్షన్ థ్రిల్లర్ మహాన్.. మేకింగ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Pan Card: పాన్‌కార్డ్ పోయిందా.. మరేం పర్వాలేదు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..!
Russia Ukraine Crisis: రష్యా రాజధానిపై మళ్లీ బాంబుల వర్షం.. లైవ్ వీడియో