Good News: కరోనా మహమ్మారి పోరాటంలో మరింత పురోగతి.. కోవిడ్‌ను జయించే వారి సంఖ్య ఎక్కువే..!

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు పెరిగే పాజిటివ్‌ కేసుల కన్నా రికవరీ అయ్యే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. గురువారం దేశంలో 1,86,364..

Good News: కరోనా మహమ్మారి పోరాటంలో మరింత పురోగతి.. కోవిడ్‌ను జయించే వారి సంఖ్య ఎక్కువే..!
COVID-infected patients
Follow us
Subhash Goud

|

Updated on: May 29, 2021 | 7:21 AM

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు పెరిగే పాజిటివ్‌ కేసుల కన్నా రికవరీ అయ్యే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. గురువారం దేశంలో 1,86,364 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,59,459 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో రికవరీ కేసుల సంఖ్య2,48,93,410 ఉంది.

➦ విజయవాడ పటమటకు చెందిన గూడపాటి సుబ్రమణ్యం సతీమణి లక్ష్మీ ఈశ్వరమ్మ (99) కరోనాను జయించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

➦ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న 8 రోజుల శిశువుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైద్య చికిత్స అనంతరం శిశువు కరోనాను జయించాడు.

➦ కరోనా నుంచి ఓ 37 రోజుల చిన్నారి ప్రాణాలు బయటపడింది. కూకట్‌పల్లిలో చిన్నారి పుట్టిన 37 రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌ వచ్చింది. చిన్నారికి కిమ్స్‌ ఆస్పత్రిలో ప్రత్యేక విధానంతో చికిత్స నిర్వహించి చిన్నారి కరోనా నుంచి కోలుకునేలా చేశారు. మొదట్లో ఆరోగ్యంగానే ఉన్నా వారం తర్వాత శిశువుకు ఆక్సిజన్‌ లెవల్స్‌తోపాటు బరువు తగ్గడంతో వైద్యులు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది.

➦ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో స్వరాజ్యలక్ష్మి (103) వృద్ధురాలు కరోనాను జయించారు. చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్లకుండా వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ కరోనాను జయించారు. కరోనా అంటే ఎలాంటి భయాందోళన చెందవద్దని ఆ వృద్ధురాలు చెబుతోంది.

➦ ఇండియాలో తొలిసారి యాంటీబాడీస్ కాక్‌టెయిల్‍‌తో చికిత్స తీసుకుని కోలుకున్నాడు ఓ వ్యక్తి. హర్యానాలోని గురుగ్రామ్‌ మెదాంత ఆస్పత్రిలో 84 ఏళ్ల వృద్ధుడు మొహబ్బత్ సింగ్‌కు ఐదు రోజులుగా యాంటీబాడీ కాక్టెయిల్ డ్రగ్‌ను అందించారు. దీంతో బుధవారం కోలుకున్నాడు. ఇది సక్సెస్ అయితే మరింతమంది పేషెంట్లను కాపాడవచ్చని వైద్యులు తెలిపారు. అయితే ఫస్ట్‌ వేవ్‌లో కంటే సెకండ్‌ వేవ్‌లో కోవిడ్‌ తీవ్ర స్థాయిలో ఉన్నా.. చాలా మంది కరోనాను జయిస్తున్నారు. దేశంలో, రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులతో పాటు రికవరీ కేసులు చాలా ఉంటున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Anandaiah Medicine: ఆనందయ్య మందుపై కొనసాగుతున్న విచారణ.. నేడు తుది నివేదిక: ఆయుష్‌ కమిషనర్‌ రాములు

Non Veg Sales Bans: మాంసం ప్రియులకు ఊహించని షాక్.. ఆదివారం మాంసం దుకాణాలు బంద్.. కారణం అదేనా..?