‘మా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ కాలాన్ని పెంచడం మంచి నిర్ణయమే,’ సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా , ఇది శాస్త్రీయమేనని వ్యాఖ్య

తమ సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులమధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న ఆరు నుంచి 8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమేనని సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా అన్నారు.

  • Updated On - 7:10 pm, Thu, 13 May 21 Edited By: Phani CH
'మా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ కాలాన్ని పెంచడం మంచి నిర్ణయమే,' సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ,  ఇది శాస్త్రీయమేనని వ్యాఖ్య
Adar Poonawalla

తమ సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులమధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న ఆరు నుంచి 8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమేనని సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా అన్నారు. ఇలా గ్యాప్ ను పెంచడం శాస్త్రీయంగా గుడ్ డెసిషన్ అని ఆయన అభివర్ణించారు. ఇది టీకామందు సత్తాను, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని, పైగా నిపుణులు శాస్త్రీయంగా చేసిన సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం డేటాను సేకరించిందని ఆయన చెప్పారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ కొత్త సూచన కోవిషీల్డ్ ఉత్పత్తిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. మరింత ఎక్కువమంది ప్రజలు మొదటి డోసును తీసుకోవడానికి కూడా ఇది ఉపకరిస్తుందని అంటున్నారు . మొదట్లో రెండు డోసుల మధ్య విరామం నాలుగు నుంచి ఆరు వారాలు ఉండాలని నిర్దేశించారు.ఆ తరువాత అది 6 నుంచి8 వారాలకు పెరిగింది. ఇప్పుడు 12 నుంచి 16 వారాలకు పెంచాలన్నది కొత్త సిఫారసు. ఇలా ఇంటర్వెల్ పెరిగేకొద్దీ వ్యాక్సిన్ సామర్థ్యం పెరుగుతుందట.. రెండు డోసుల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటె సత్తా 81.3 శాతం ఉంటుందని, అదే 6 వారాల కన్నా తక్కువ ఉంటే ఇది 55.1 శాతం ఉంటుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. కానీ ఎందుకో కొవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో మాత్రం మార్పు లేదు.

బ్రిటన్ నుంచి అందిన ఆధారాల ప్రకారం ఈ విరామ కాలాన్ని పెంచేందుకు కోవిడ్ పై గల వర్కింగ్ గ్రూప్ అంగీకరించిందని కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి ఇచ్చే ఇంటర్వెల్ ను పెంచడం వల్ల దీని సామర్థ్యం పెరుగుతుందని గత ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Flipkart Passwords: వెంట‌నే మీ ఫ్లిప్‌కార్ట్ పాస్‌వ‌ర్డ్‌ను మార్చేయండి.. హెచ్చ‌రిస్తోన్న సైబ‌ర్ నిపుణులు..

CORONA VACCINATION: దేశంలోకి ఇక వెల్లువలా వ్యాక్సిన్లు.. దేశీయ ఉత్పత్తిలోను భారీ పెరుగుదల?