AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddu Moosewala: సిద్దూ మూసేవాలా హత్య కేసులో కీలక మలుపు.. ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్ అరెస్టు..?..

పంజాబ్ లో పెను సంచలనం కలిగించిన హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్​ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా అతడిని అదుపులోకి తీసుకున్నారు...

Siddu Moosewala: సిద్దూ మూసేవాలా హత్య కేసులో కీలక మలుపు.. ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్ అరెస్టు..?..
Siddu Moosewala
Ganesh Mudavath
|

Updated on: Dec 02, 2022 | 11:04 AM

Share

పంజాబ్ లో పెను సంచలనం కలిగించిన హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్​ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలిఫోర్నియా పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. నవంబర్ 20కి ముందే అరెస్ట్ చేసి, భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఉన్న 2 కేసుల్లో అతడిపై నోటీసులు జారీ అయ్యాయి. కెనడాకు పలాయనమైన గోల్డీ న్యాయవాదుల సహాయంతో అక్కడి నుంచి కాలిఫోర్నియాకు వెళ్లాడు. కాగా.. పంజాబ్‌లో కాంగ్రెస్‌ నాయకుడు, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలో జీపులో వెళ్తున్న సమయంలో ఆయనపై ఓ బృందం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో సిద్ధూ మూసేవాలా మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మూసేవాలాను హత్య చేసిన తర్వాత గోల్డీ.. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో నివాసమున్నట్లు సమాచారం. గోల్డీ బ్రార్ దొరికినట్లు భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), సీబీఐ, పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దూ మూసేవాలా హత్య తర్వాత గోల్డీ బ్రార్ సమాచారం ఇస్తే రూ. 2 కోట్ల రివార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన తండ్రి డిమాండ్ చేశాడు. కేంద్రం ఇవ్వలేకపోతే తానే సొంతంగా డబ్బులు ఇస్తానని సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ చెప్పడం గమనార్హం.

గతేడాది డిసెంబర్​లో సిద్ధూ.. కాంగ్రెస్​లో చేరారు. పంజాబ్‌లోని మాన్సా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తుపాకీలు, గ్యాంగ్‌స్టర్లు.. ఇలా హింసను ప్రేరేపించేవి ఎక్కువగా పాటల్లో చూపించే వివాదాస్పద గాయకుడిగా వార్తల్లోనూ నిలిచారు. ‘తేరీ మేరీ జోడీ’, మోసా జఠ్‌.. వంటి చిత్రాల్లోనూ నటించారు. 2020 జులై కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఫైరింగ్‌ రేంజ్‌లో ఏకే-47 ను ఉపయోగించాడన్న అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..