Viral: ఎవర్రా మీరంతా.. మోమోస్ తింటుండే వెనుకనుంచి వచ్చి.. ఏం చేసారంటే.. వీడియో
నోయిడాలోని సెక్టార్ 12.. ఎప్పుడూ ఈ ప్రాంతం వచ్చి పోయే జనాలతో రద్దీగానే ఉంటుంది.. అయితే.. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకుని అలా బజారుకు వచ్చాడు.. అక్కడున్న మోమోస్ సెంటర్ కు వెళ్లి.. ఆర్డర్ ఇచ్చాడు.. ఇద్దరు పిల్లలతో కలిసి మోమోస్ తింటున్నాడు.. అప్పుడే.. ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. బిత్తర చూపులు చూస్తూ.. ఆ వ్యక్తి వెనుకనే నిలబడ్డారు..

నోయిడాలోని సెక్టార్ 12.. ఎప్పుడూ ఈ ప్రాంతం వచ్చి పోయే జనాలతో రద్దీగానే ఉంటుంది.. అయితే.. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకుని అలా బజారుకు వచ్చాడు.. అక్కడున్న మోమోస్ సెంటర్ కు వెళ్లి.. ఆర్డర్ ఇచ్చాడు.. ఇద్దరు పిల్లలతో కలిసి మోమోస్ తింటున్నాడు.. అప్పుడే.. ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. బిత్తర చూపులు చూస్తూ.. ఆ వ్యక్తి వెనుకనే నిలబడ్డారు.. ఉన్నట్టుండి.. అతని మెడలోని చైన్ ను లాగేశాడు.. వెంటనే అక్కడి నుంచి ఇద్దరు దుండగులు.. బైక్ పై పారిపోయారు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నోయిడాలోని సెక్టార్ 12లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక వ్యక్తి నుంచి బంగారు గొలుసు లాక్కొని, అతను స్పందించేలోపే పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 19 బుధవారం ఎం బ్లాక్ మార్కెట్ సమీపంలో జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కొండ్లి నివాసి అయిన బాధితుడు లలిత్ తన కుటుంబంతో కలిసి సాయంత్రం స్నాక్ కోసం మార్కెట్‌కు వెళ్లాడు. అతను ఒక దుకాణం బయట నిలబడి ఉండగా, ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చారు. వారిలో ఒకరు దిగి బాధితుడిని కొన్ని క్షణాలు గమనించగా.. మరొకరు ఇంజిన్‌ను ఆన్ లో ఉంచి.. సిద్ధంగా ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత, మొదటి దుండగుడు లలిత్ మెడలోని బంగారు గొలుసును లాక్కొని తన సహచరుడితో కలిసి బైక్ పై పారిపోయాడు.
వీడియో చూడండి..
उत्तर प्रदेश के सबसे तेजी से उभरते शहर नोएडा में एक शख्स दुकान पर मोमोज खा रहा था। आत्मनिर्भर 2 बदमाश वहां आए। तसल्ली पूर्वक खड़े होकर गतिविधियां देखी। मौका पाते ही उसके गले से सोने की चेन लूटकर भाग निकले। pic.twitter.com/ySNbgYn9At
— Sachin Gupta (@SachinGuptaUP) March 22, 2025
బాధితుడు వారిని వెంబడించడానికి ప్రయత్నించాడు.. కానీ విఫలమయ్యాడు. ఈ మొత్తం సంఘటన సమీపంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరాలో రికార్డైంది. నిందితులు సంఘటన స్థలం నుండి పారిపోయే ముందు వారి ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ఫుటేజ్ స్పష్టంగా చూపిస్తుంది. లలిత్ ఫిర్యాదు మేరకు సెక్టార్ 24 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మరికొన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతను పెంచాలని నివాసితులు అధికారులను కోరుతున్నారు. కాగా.. నగరంలో నేరాలను అరికట్టడానికి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే అప్రమత్తంగా ఉండాలని, సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..