భారీ వర్షం.. మూడేళ్ల కూతుర్ని బైక్‌పై తీసుకెళ్తున్న తండ్రి! ఇంతలో ఒక్కసారిగా..
బెంగుళూరులోని జీవన్‌హళ్లిలో శనివారం రాత్రి గాలి, వర్షాలతో ఒక భారీ చెట్టు కూలి, బైక్‌పై ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి రక్ష మృతి చెందింది. ఆమె తండ్రి సత్య తీవ్రంగా గాయపడ్డాడు. చెట్టు కొమ్మ తగలడంతో చిన్నారి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

మూడేళ్ల చిన్నారి కూతురితో కలిసి ఓ తండ్రి బైక్‌పై వెళ్తుండగా.. ఒక్కసారిగా భారీ వృక్షం వారిపై పడింది. ఈ ప్రమాదంలో చెట్టు కొమ్ము తగలడంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులోని పులకేశినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవన్‌హళ్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మూడేళ్ల రక్ష తన తండ్రి సత్యతో కలిసి బైక్ పై వెళుతుండగా గాలి, వర్షం కారణంగా వారిపై బైక్‌పై రోడ్డు పక్కన చెట్టు కూలిపోయింది. ఫలితంగా, బైక్ ముందు కూర్చున్న రక్షకు కొమ్ము తగిలింది. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి మరణించింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి రక్ష, కమ్మనహళ్లి సమీపంలోని కుల్లప్ప సర్కిల్ నివాసితులు శక్తి, సత్య దంపతుల కుమార్తె. చిన్నారితో బైక్ వెళ్తున్న క్రమంలో జీవన్‌హళ్లి రోడ్డులోని ఒక హోంగే చెట్టు కూలి సరిగ్గా బైక్‌పై పడింది.
దాంతో రక్ష తలకు బలమైన గాయమైంది. స్థానికులు చిన్నారి రక్షను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది. హాస్పిటల్ దగ్గర బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల రోదన అందరి చేత కన్నీళ్లు పెట్టించాయి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని కోల్పోయిన ఆ దంపతులు గుండెలవిసేలా రోదించారు. బీబీఎంపీ ఈస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ సరోజా దేవి, బీబీఎంపీ ఫారెస్ట్ యూనిట్ చీఫ్ రారా స్వామి ఆసుపత్రిని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. దీనికి సంబంధించి పులకేశి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఒక యూడీఆర్ నమోదు చేశారు. కాగా ఈ ప్రమాదంలో రక్ష తండ్రి సత్య కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన వెన్నుముకకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.