AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat Farming: మేకల పెంపకంతో లక్షల్లో లాభాలు.. అయితే, ఈ కీలక సమాచారం తెలుసుకోవాల్సిందే..

Goat Farming: మేకల పెంపకం జార్ఖండ్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా రైతులకు ఇది అధిక ఆదాయాన్ని

Goat Farming: మేకల పెంపకంతో లక్షల్లో లాభాలు.. అయితే, ఈ కీలక సమాచారం తెలుసుకోవాల్సిందే..
Goats
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 15, 2021 | 10:52 AM

Goat Farming: మేకల పెంపకం దేంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా రైతులకు ఇది అధిక ఆదాయాన్ని సముపార్జించి పెడుతుంది. మేకల పెంపకం రాష్ట్ర రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుంది. గ్రామీణ మహిళలు స్వావలంబన సాధించేందుకు మేకల పెంపకం ఎంతగానో ఉపకరిస్తుంది. స్వయం ఉపాధి పొందాలనుకునే వారు మేకల పెంపకాన్ని ఎంచుకుంటే మంచిదనే చెప్పొచ్చు. ఈ కారణంగానే.. రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం మహిళా సంఘాలకు, రైతులుకు మేకలను పంపిణీ చేస్తున్నారు. అయితే, మేకల పెంపకం అంత ఈజీ ఏమీ కాదు. చాలా శ్రమతో కూడుకున్న పని. మరి మేకల పెంపకంలో ఎలాంటి మెళకువలు పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అదనపు ఆదాయ వనరు.. మేకలు రైతులకు మంచి ఆదాయపు వనరుగా చెప్పాలి. అయితే, వర్షాకాలంలో మేకలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సీజన్‌లో తేమ అధికంగా ఉంటుంది. వర్షం కారణంగా మేకలు తినే గడ్డి సరిగా ఉండదు. ఆ కారణంగా పశుగ్రాసానికి కొరత ఏర్పడుతుంది. అందువల్ల మేకలు తినే గ్రాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మేకలు రైతులకు మంచి ఆదాయ వనరు అయినందున.. వాటి నిర్వహణ, పోషణను సక్రమంగా చూసుకోవాలి. మేకల ఉత్పత్తి ఎంత బాగా పెరిగితే.. రైతులకు అంత లాభం చేకూరుతుంది.

అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం.. మేకల పెంపకం సీజన్‌ను బట్టి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అయితే వర్షాకాలం ఎంతో కీలకం. మరి వర్షాకాలంలో మేకలను ఎలా చూసుకోవాలి? వ్యాధుల బారిన పడుకుండా ఎలా వాటిని సంరక్షించాలి..? అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో సామర్థ్యానికి అనుగుణంగా మేకల ఉత్పత్తిని చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే.. వర్షాకాలంలో మేకలు, వాటి పిల్లల మరణాల రేటు చాలా వరకు తగ్గుతుంది. అదే సమయంలో వృద్ధి కూడా పెరుగుతుంది. రైనీ సీజన్‌లో మేకల నిర్వహణ సరిగా ఉంటే.. మిగతా సీజన్ల కంటే కూడా అధికంగా లాభం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి.. వర్షాకాలంలో, మేకల పెంపకానికి సంబంధించి కొన్ని ప్రత్యేక విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున మేకల పెంపకం సాగించే చిన్న తరహా రైతులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. వర్షాలు మొదలయ్యే ముందు మేకల షెడ్‌‌ని ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంటుంది. వర్షం కురవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మేకల షెడ్లలో నీరు నిలిస్తే అవి న్యూమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. అందువల్ల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇక వాటికి ఆహారంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ సీజన్‌లో పచ్చి పశుగ్రాసం అధికంగా తింటాయి. అయితే, వర్షాల కారణంగా ఆ పశుగ్రాసం అపరిశుభ్రంగా ఉంటుంది. తద్వారా మేకలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే మేత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మేకలకు సమతుల్య ఆహారం అందించే ప్రయత్నం చేయాలి. దీని వల్ల మేకలు ఆరోగ్యంగా ఉండి.. ఉత్పత్తి పెరుగుతుంది. లాభాలూ పెరుగుతాయి.

Also read:

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి గాయం!.. ఆల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి(వీడియో): America Attacks

Mixed Vegetable Salad: బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ ఫుడ్.. మిక్సిడ్ వెజిటబుల్ సలాడ్.. తయారీ విధానం ఎలా అంటే

Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..