‘డీజిల్ ఇవ్వు, నీ కూతురిని వెదుకుతాం’ ఓ తల్లికి యూపీ పోలీసుల నిర్లక్ష్యపు సమాధానం.

యూపీలోని కాన్పూర్ లో సరిగా నడవలేని  ఓ అభాగ్యురాలిపట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. గత నెలలో తన బంధువొకరు  తన మైనర్ కూతురిని కిడ్నాప్ చేశాడని..,

  • Umakanth Rao
  • Publish Date - 1:54 pm, Tue, 2 February 21
'డీజిల్ ఇవ్వు, నీ కూతురిని వెదుకుతాం' ఓ తల్లికి యూపీ పోలీసుల నిర్లక్ష్యపు సమాధానం.

యూపీలోని కాన్పూర్ లో సరిగా నడవలేని  ఓ అభాగ్యురాలిపట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. గత నెలలో తన బంధువొకరు  తన మైనర్ కూతురిని కిడ్నాప్ చేశాడని, ఆమెను వెతికిపెట్టాలని  ఈమె పోలీసులను కోరుతోంది. అయితే ఇందుకు వారు తమ వాహనాల్లో డీసెల్ పోయించాలని షరతు పెడుతున్నారట. ఇందుకోసం గుడియా అనే ఈ మహిళ తన బంధువుల  నుంచి అప్పు తీసుకుని ఆ పోలీసులకు 10 వేలనుంచి 15 వేలరూపాయల వరకు విలువైన డీసెల్ పోయించిందట.. కానీ ఇంత చేసినా వారు తనను చీదరించుకుంటున్నారని, వెళ్లిపొమ్మని కసురుకుంటున్నారని ఈమె వాపోయింది. చేతి కర్రల సాయంతో నడుస్తున్న ఈమెకి కొద్దిపాటి సొంత భూమి ఉందని తెలిసింది. తాను ఎప్పుడు వెళ్లినా పోలీసులు తనను కులం పెట్టి దూషిస్తున్నారని, పైగా నీ కూతురు ప్రవర్తన బాగులేనందునే వెళ్లిపోయిందేమో అని అసభ్యంగా మాట్లాడుతున్నారని గుడియా ఆరోపించింది.

గుడియా దీనస్థితికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈమె కేసును పరిష్కరించాలని, ఈమె కూతురిని ఈ తల్లికి అప్పగించాలని కాన్పూర్ పోలీసులను ఆదేశించారు. ఈ కేసుపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

Read More:Russia Covid Vaccine: ‘అదిగో స్పుత్నిక్’ ! రష్యా నుంచి కాన్పూర్ కి వచ్ఛేవారం వ్యాక్ సీన్ ! రెండో దశ ట్రయల్స్ రెడీ ?