AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajya Sabha: రైతుల సమస్యలపై పట్టువీడని విపక్షాలు.. రాజ్యసభ రేపటికి వాయిదా..

కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల చేస్తున్న ఆందోళన సెగ రాజ్యసభకు తాకింది. అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లో 60రోజులకు పైగా చేస్తున్న ఆందోళనపై, చట్టాలపై..

Rajya Sabha: రైతుల సమస్యలపై పట్టువీడని విపక్షాలు.. రాజ్యసభ రేపటికి వాయిదా..
Shaik Madar Saheb
|

Updated on: Feb 02, 2021 | 1:31 PM

Share

Farmers Protest – Rajya Sabha adjourned : కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల చేస్తున్న ఆందోళన సెగ రాజ్యసభకు తాకింది. అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లో 60రోజులకు పైగా చేస్తున్న ఆందోళనపై, చట్టాలపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చ నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేప‌థ్యంలో స‌భ మూడు సార్లు వాయిదా ప‌డింది. అయినప్పటికీ విపక్ష పార్టీల స‌భ్యులు ఆందోళ‌న‌లు విర‌మించ‌క‌పోవ‌డంతో.. స‌భ‌ను రేపు ఉదయం 9గంటల వరకు వాయిదా వేశారు.

ఈ అంశంపై రేపు చర్చిద్దామంటూ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ ప‌లుసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విపక్ష సభ్యులు తమ పంతాన్ని వీడలేదు. అంతేకాకుండా సభ ప్రారంభం కాగానే విప‌క్ష స‌భ్యులు వాకౌట్ కూడా చేశారు. రూల్ 267 ప్రకారం చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్ష పార్టీలు కోరగా.. చైర్మన్ వెంక‌య్య దానిని తిరస్కరించారు.

Also Read:

Fact Check: ఢిల్లీ అల్లర్ల అనంతరం 200 మంది పోలీసులు రాజీనామా చేశారా? అసలు నిజాన్ని వెల్లడించిన పోలీసులు

ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు