అబ్బాయి మృతి చెందిన వారానికే అమ్మాయి.. ఇదో ఓ విషాద ప్రేమకథ..
ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. అది కూడా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే అమ్మాయి కూడా అఘాయిత్యానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఇలా ప్రేమ పేరుతో ఆత్మహత్యలకు పాల్పడడం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. అది కూడా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే అమ్మాయి కూడా అఘాయిత్యానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఇలా ప్రేమ పేరుతో ఆత్మహత్యలకు పాల్పడడం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అమ్మాయి.. అబ్బాయి ఆత్మహత్య కేసులో అసలేం జరిగింది.. అనే వివరాలను తెలుసుకోండి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ నగరంలోని నిహాల్ నగర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి కుదిర్చారని, అలా అయితే తాను ప్రేమించిన అమ్మాయితో జీవించడం సాధ్యం కాదని దీపక్ అనే యువకుడు మార్చి 15వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి నిఖిత (20) తో కలిసి బతకాలనుకున్నాడు.. కానీ.. తన కుటుంబం తనకు వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. విషం తాగి తనువు చాలించాడు.
ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి కూడా మానసికంగా కుంగిపోయింది.. దీపక్ లేకుండా తాను కూడా ఈ లోకంలో ఉండలేనని భావించి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సరిగ్గా ఏడు రోజుల తర్వాత మార్చి 22న నిఖిత కూడా విషం తాగింది. నిఖిత ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, చికిత్స పొందుతూ నిఖిత ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం తర్వాత నికిత మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించారు. వెంటవెంటనే నగరంలో జరిగిన ఈ ఆత్మహత్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీపక్, నిఖితల ఆత్మహత్యల వెనుక ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. అప్పుడే ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటపడింది. దీపక్, నిఖిత చాలా సన్నిహితంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అందులో ఓ ఫోటో వెనుక నిఖిత రాసిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. “నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను, నువ్వు నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేశావు” అని రాసి ఉండడంతో ఇద్దరి మధ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో నిఖిత ఆత్మహత్య చేసుకుంటున్న లైవ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె విషం తాగుతూ వీడియో రికార్డు చేసుకుంది. అయితే.. వాళ్లు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు కుటుంబ సభ్యులు, సన్నిహితుల వద్ద ఆరా తీశారు.
ఈ మొత్తం విషయానికి సంబంధించి నౌగావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సునీల్ శర్మ మాట్లాడుతూ.. యువకుడు దీపక్ ఇంట్లో ప్రేమించిన అమ్మాయితో కాదని, వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసి కలత చెందిన నిఖిత.. సరిగ్గా వారం తర్వాత తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. అయితే.. ఈ మొత్తం తతంగాన్ని నిఖిత వీడియో కూడా రికార్డు చేసుకుందని చెప్పారు. నిఖిత మొబైల్ లాక్ చేయబడి ఉండటం వల్ల ఇంకా ఈ ఆత్మహత్యల వెనక పూర్తి సమాచారం తెలియరాలేదని అన్నారు. మొబైల్ ఓపెన్ చేయగలిగితే ఆత్మహత్యలకు గల మరిన్ని కారణాలు తెలుసుకునే అవకాశం ఉండేదన్నారు. మృతుడు దీపక్ కాల్ వివరాలను సేకరించిన పోలీసులు.. అసలు నిజాలు రాబట్టడానికి అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
