Girl Trapped In Well: సెల్ఫీ తెచ్చిన సరదా.. బావిలో పడ్డ యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!
Girl Trapped In Well: ఈ మధ్యకాలంలో యువతకు సెల్ఫీ సరదా ఎక్కువైపోయింది. సెల్ఫీలు దిగడంలో భాగంగా కొన్నిసార్లు ప్రాణాల మీదకు...
Girl Trapped In Well: ఈ మధ్యకాలంలో యువతకు సెల్ఫీ సరదా ఎక్కువైపోయింది. సెల్ఫీలు దిగడంలో భాగంగా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా ఇదే తరహా ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బావి మీద నిలబడి సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ యువతి ఏకంగా తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామానికి చెందిన ఓ యువతి బావిపై నిల్చుని సెల్ఫీ దిగాలని భావించింది. అనుకున్నదే తడువుగా బావిపైకి ఎక్కి చివరిలో నిలబడింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి బావిలో పడిపోయింది.
బావిలో పడిన యువతి అరుపులు విని అటుగా వెళ్తున్న ఓ యువకుడు వచ్చి సహాయం చేశాడు. బావిలో దిగి ఆమెను రక్షించాడు. కానీ పైకి ఎలా రావాలో అతని అర్ధం కాలేదు. దీనితో ఈ ఇద్దరూ కాపాడండి అంటూ అరవగా.. వారి అరుపులు విన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు అతికష్టం మీద వారిని పైకి తీసుకొచ్చారు.
Also Read: Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..