AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gallantry Award List 2022: ఈసారి 939 మందికి గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రతలో అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించిన వీర జవాన్లకు శౌర్య పురస్కారాలు అందజేస్తారు.

Gallantry Award List 2022: ఈసారి 939 మందికి గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం
Gallantry Award List
Balaraju Goud
|

Updated on: Jan 25, 2022 | 1:20 PM

Share

Gallantry Award List 2022: ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రతలో అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించిన వీర జవాన్లకు శౌర్య పురస్కారాలు అందజేస్తారు. ఇందులో భాగంగా ఈఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి 939 మంది పోలీసు సిబ్బంది వారి ధైర్యసాహసాలకు గాను గ్యాలంట్రీ అవార్డులతో సత్కరించనున్నారు. ఇందులో 189 మంది వీరులకు పోలీస్ మెడల్ అందజేయనున్నారు. అదే సమయంలో, 88 మంది ధైర్యవంతులకు విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పోలీసు పతకం (PPM), 662 మంది ప్రతిభ కనబర్చినందుకు పోలీసు పతకం (PM) ఇవ్వనున్నారు. పోలీస్ మెడల్ పొందిన 189 మంది శౌర్య గ్రహీతలలో, 134 మంది సిబ్బంది జమ్మూ , కాశ్మీర్ ప్రాంతంలో వారి శౌర్యం కోసం సత్కరించనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది ధైర్యసాహసాలు, ఢిల్లీకి 3, జార్ఖండ్‌కు 2, మధ్యప్రదేశ్‌కు 3, మహారాష్ట్రకు 7, మణిపూర్‌కు 7, ఉత్తరప్రదేశ్‌కు 1, ఉత్తరప్రదేశ్‌కు 1 మందికి పోలీసు మెడల్స్ లభించాయి. తొమ్మిది ఒడిశాలో తమ అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించిన వీరులకు పోలీసు పతకాలను అందజేస్తారు. ఇందులో 30 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని కూడా పోలీస్‌ మెడల్‌తో సత్కరించనున్నారు. అదే సమయంలో, ముగ్గురు SSB సిబ్బందికి కూడా పోలీసు పతకాలు ఇవ్వడం జరుగుతుంది.

జైళ్ల శాఖ కు కరెక్షనల్ సర్వీస్ మెడల్స్ 2022 మరోవైపు, జైళ్ల శాఖకు కరెక్షనల్ సర్వీస్ మెడల్స్ 2022 (జైలు సిబ్బంది కి దిద్దుబాటు సేవా పతకాలు) ప్రకటించింది కేంద్రం. రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణకు మూడు ప్రెసిడెంట్స్ కరెక్షనల్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. ఎం పంత్(చీఫ్ హెడ్ వార్డర్), సిఎన్ గంట రత్నారావు(హెడ్ వార్డర్), బి. నర్సింగ్ రావు(హెడ్ వార్డర్) కు పతకాలు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఆరు పతకాలు లభించాయి. ఒక ప్రెసిడెంట్స్ కరెక్షనల్ సర్వీస్ విశిష్ట సేవా పతకం, 5 మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. ఐనపర్తి సత్యనారాయణ ( హెడ్ వార్డర్) కు విశిష్ట సేవా పతకంతో సత్కరించనున్నారు. పోచ వరుణ రెడ్డి(డిప్యూటీ సూపరింటెండెంట్), పెదపూడి రామ చంద్ర రావు(డిప్యూటీ సూపరింటెండెంట్), మహ్మద్ షఫీ రహమాన్(డిప్యూటీ సూపరింటెండెంట్), సాము చంద్ర మోహన్(హెడ్ వార్డర్), హంసా పాల్(డిప్యూటీ సూపరింటెండెంట్) లకు మెరిటోరియల్ సర్వీస్ పతకాలు దక్కాయి.

Award

Award

Read Also…  YSR EBC Nestham: అగ్రవర్ణాల మహిళలకు ఆర్థిక సాయం.. వారి ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేసిన సీఎం జగన్