G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా కల్చర్ కారిడార్.. 29 దేశాల కళాఖండాలు ఇవే..
Culture Corridor - G20 Digital Museum: భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం అయింది. ఈ సదస్సులో 20 దేశాల సభ్యులతోపాటు.. 9 ఆహ్వానిత దేశాల సభ్యులు అంతర్జాతీయ అంశాలు, పలు సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు. జీ20 గ్రూప్ తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు.
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం అయింది. ఈ సదస్సులో 20 దేశాల సభ్యులతోపాటు.. 9 ఆహ్వానిత దేశాల సభ్యులు అంతర్జాతీయ అంశాలు, పలు సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు. జీ20 గ్రూప్ తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను అయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’కు సంబంధించిన విజన్‌పై చేస్తోన్న కృషికి జీ20 ఓ వేదికగా మారడం సంతృప్తినిచ్చిందంటూ సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కాగా.. G20 శిఖరాగ్ర సమావేశానికి వేదికైన భారత్ మండపంలో ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ ప్రాజెక్ట్ – ‘కల్చర్ కారిడార్ – G20 డిజిటల్ మ్యూజియం’ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. జీ20 సదస్సులో కల్చర్ కారిడార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్చరల్ కారిడార్ G20 సభ్యులు, ఆహ్వానిత దేశాల భాగస్వామ్య వారసత్వాన్ని సూచిస్తుంది. ఇది G20 సభ్యులు, 9 ఆహ్వానిత దేశాల గుర్తింపు చిహ్నాలు.. గుర్తించదగిన సాంస్కృతిక వస్తువులు.. వారసత్వాన్ని కలిగి ఉంటుంది.
ఈ కల్చర్ కారిడార్ విభిన్న సాంస్కృతిక వ్యక్తీకరణల అవగాహన.. వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడం, చేరిక, సమానత్వం కోసం.. భాగస్వామ్య గుర్తింపు భావాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన వేదికగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం G20 థీమ్ ‘వసుధైవ కుటుంబం’, కల్చర్ వర్కింగ్ గ్రూప్ (CWG) హాల్‌మార్క్ క్యాంపెయిన్ ‘కల్చర్ యూనైట్స్ ఆల్’ ఆధారంగా రూపొందించారు. జీ20 సదస్సు జరిగే భారత మండంపలో దీనిని ఆవిష్కరించి.. రెండు రోజుల పాటు ప్రదర్శించారు. దీనిలో దేశాల వారీగా G20 సభ్యులు, 9 ఆహ్వానిత దేశాల సాంస్కృతిక వస్తువులు, వారసత్వ వివరాలను ప్రతినిధులకు తెలిసేలా.. ఏర్పాట్లు చేశారు.
Culture Corridor – G20 Digital Museum ప్రధాన ఉద్దేశం.. సాంస్కృతిక ప్రాముఖ్యత, దిగ్గజ కళాఖండాలు, కనిపించని సాంస్కృతిక వారసత్వం, సహజ వారసత్వం, ప్రజాస్వామ్య పద్ధతులకు సంబంధించిన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. G20 సమ్మిట్ వేదిక సభ్య దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, అవగాహనను ప్రోత్సహించడానికి ఒక కళ.. సంస్కృతి ప్రదర్శనను నిర్వహించారు. వివిధ కళాఖండాలు, సాంస్కృతిక కళాఖండాలను ప్రదర్శించడం ద్వారా, సమ్మిట్ లో పాల్గొనే ప్రతి దేశం విభిన్న వారసత్వం, చరిత్రను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుని భారత్ సఫలీకృతమైంది.
భారతదేశం – పాణిని అష్టాధ్యాయి ప్రాముఖ్యత ఏమిటి?
పాణిని అష్టాధ్యాయి అనేది క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలో పండితుడు పాణిని రచించిన భాషా గ్రంథం.. ఇది సంస్కృతం రాయడానికి, మాట్లాడటానికి ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఇది భారతదేశ భాషా చరిత్రలో కీలకమైన భాగం. దీని చేరిక భాష అభివృద్ధికి భారతదేశం, సహకారాన్ని, భాషా అధ్యయనాలపై దాని శాశ్వత ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.
కల్చర్ కారిడార్.. జీ20 డిజిటల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక చిహ్నాలు.. దేశాల వారీగా..
- భారతదేశం – అష్టాధ్యాయై
- ఇండోనేషియా – బాటిక్ సరోంగ్ వస్త్రాలు
- బ్రెజిల్ – బ్రెజిల్ నేషనల్ పార్లమెంటరీ ప్యాలెస్ నమూనా
- అర్జెంటీనా – పోంచో
- ఆస్ట్రేలియా – (YIŊAPUŊAPU AT DJARRAKPI) సాంస్కృతిక పెయింటింగ్..
- కెనడా – సీ మాన్‌స్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాస్క్
- చైనా – ఫాహువా లోటస్ పాండ్ డిజైన్‌తో ఉన్న కూజా
- యూరఓపియన్ యూనియన్ – మేరీ స్కోడోవ్స్కా-క్యూరీ (1867-1934) కాంస్య విగ్రహం
- ఫ్రాన్స్ – నీలిరంగు నేపథ్యం, సీతాకోకచిలుకలు, ట్రెఫాయిల్‌ల అలంకరణతో ఆక్సర్ వాసే పింగాణీ
- జర్మనీ – VW బీటిల్ మినియేచర్ మోడల్స్
- ఇటలీ – బెల్వెడెరే అపోలో
- జపాన్- నెండోరాయిడ్ హాట్సునే మికు: కోరిన్ కిమోనో వెర్షన్, కోసోడ్ (వస్త్రం)
- రిపబ్లిక్ ఆఫ్ కొరియా – ఆర్టిజన్-క్రాఫ్టెడ్ టోపీ, గాట్, హెడ్‌పీస్, జోక్‌దూరి
- మెక్సికో – ద్వంద్వత్వం శిల్పం: క్వెట్జాల్‌కోట్, తల్టెకుహ్ట్లీ (భూమి దేవత)
- రష్యా – సాంప్రదాయ ఖాకాస్ మహిళల దుస్తులు, షర్ట్, పోగో
- సౌదీ అరేబియా – అరామిక్ శాసనం
- దక్షిణ ఆఫ్రికా – ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్ హోమినిన్
- టర్కీయే – T- ఆకారపు సున్నపురాయి స్తంభం
- యునైటెడ్ కింగ్‌డమ్ – ఒరిజినల్ డాక్యుమెంట్ – మాగ్నా కార్టా
- USA – టైరనీ ఆఫ్ మిర్రర్స్
- బంగ్లాదేశ్ – షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రతిమ
- ఈజిప్ట్ – ది గోల్డెన్ మాస్క్, కింగ్ టుటన్‌ఖమున్ ఆధునిక ఉత్సవ కుర్చీ
- మారిషస్ – రావణ్
- నెదర్లాండ్స్ – జిగ్-జాగ్ కుర్చీ
- నైజీరియా – క్వీన్ ఇడియా కాంస్య విగ్రహం.. మధ్యయుగపు బెనిన్ కళాఖండం
- ఒమన్ – కథా అలంకరణతో సాఫ్ట్ స్టోన్ బాక్స్
- సింగపూర్ – NEWATER – NEWBREW విభిన్న ప్యాకేజింగ్‌ల (మురుగునీటిని త్రాగునీరుగా మార్చే పైలట్ ప్రాజెక్ట్) ప్రదర్శన
- స్పెయిన్ – డిసెనార్ ఎల్ ఎయిర్ – అబానికోస్
- UAE – ఒక గుర్రపు బంగారు బ్రిడిల్ ప్రతిరూపం
మరిన్ని జాతీయ వార్తల కోసం