AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: సెప్టెంబర్ 17.. జాతీయ సమైక్యత దినోత్సవంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే ?

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఘనంగా సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని భారత రాష్ట్ర సమితి శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన 17వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్న కేటీఆర్.. ఆరోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబరంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

KTR: సెప్టెంబర్ 17.. జాతీయ సమైక్యత దినోత్సవంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే ?
Minister K Taraka Rama Rao
Sridhar Prasad
| Edited By: |

Updated on: Sep 10, 2023 | 5:30 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఘనంగా సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని భారత రాష్ట్ర సమితి శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన 17వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్న కేటీఆర్.. ఆరోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబరంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా హైదరాబాద్ నగరంలో ఈ వేడుకలో పాల్గొంటారని.. దీంతోపాటు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాలలో నిర్వహించే సంబరాలకు మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేస్తారని తెలిపారు. దీంతోపాటు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా తీసుకువెళుతూ దేశానికే ఆదర్శంగా నిలిచేలా వినూత్నమైన కార్యక్రమాలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు కేటీఆర్. అయితే తెలంగాణ అభివృద్ధి పట్ల ఓర్వలేని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవం పై కూడా కొన్ని పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి

1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు.. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజన్నారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం అందరికీ గుర్తుంటుందన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయన్నారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూనేవున్నాయన్న మంత్రి కేటీఆర్, అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. అదే చైతన్యాన్ని ప్రదర్శించి.. తెలంగాణ జీవనాడిని కలుషితం చెయ్యాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?