Central Government: నేటి నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి రానున్న ఒకే దేశం.. ఒకే పర్మిట్ విధానం
Central Government: వాహనాలకు దేశ వ్యాప్తంగా ఒకే పర్మిట్ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రాలు మారినప్పుడు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే...
Central Government: వాహనాలకు దేశ వ్యాప్తంగా ఒకే పర్మిట్ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రాలు మారినప్పుడు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే వ్యక్తిగత వాహనాల్లో దేశ వ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు. వన్ నేషన్-వన్ పర్మిట్ విధానంలో భాగంగా ఆలిండియా టూరిస్ట్ వెహికిల్స్ పర్మిట్-2021 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం నుంచి వాటిని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రాలు మారినప్పుడల్లా ఫీజు చెల్లించకుండా వెసులుబాటు కల్పిస్తోంది. పర్యాటక పర్మిట్ ఫీజులను సైతం ఖరారు చేశారు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు వాహనాల్లో తొరగవచ్చు. 9 సీట్ల లోపు సామర్థ్యం ఉన్న నాన్ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, ఏసీ వాహనమైతే రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 23 సీట్ల కంటే తక్కువ ఉన్న మినీ బస్సులు, ఇతర వాహనాలు నాన్ ఏసీ అయితే ఏడాదికి రూ.50 వేలు, ఏసీ అయితే రూ.75 వేలు చెల్లించాలి. 23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్ ఏసీ బస్సులైతే టూరిస్ట్ పర్మిట్ కోసం ఏడాదికి రూ.2లక్షలు, ఏసీ బస్సు అయితే రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
టోల్ రుసుములో మార్పు లేదు..
అయితే టోల్ రుసుముల్లో ఎలాంటి మార్పు ఉండదు. టూరిస్ట్ పర్మిట్ తీసుకున్న వాహనాలు టోల్ ఫీజుతో పాటు ఇతర ఛార్జీలను చెల్లించాలని కేంద్ర మార్గదర్శకాల్లో పేర్కొంది. తాజా విధానం ద్వారా వ్యక్తిగత వాహనదారులు కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక పర్మిట్లు అవసరం లేకుండా ప్రయాణించే సౌకర్యం ఏర్పడింది. ఇప్పటి వరకు ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం వివిధ రాష్ట్రాల్లో యెల్లో నెంబర్ ప్లేట్‌ను వాహనంపై అనుమతి ఇచ్చేవారు. క్యాబ్‌లు, ఆటోలు, బస్సులకు కూడా ఇదే విధానం అమల్లో ఉండేది. యెల్లో నెంబర్ ప్లేట్ ఉన్న వాహణ యజమానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వాహనానికి సంబంధించి అదనంగా త్రైమాసిక పన్నులు, రోడ్ ట్యాక్స్‌లు, ఫిట్‌నెస్ టెస్ట్‌లు ఉంటాయి. ఫిట్‌నెస్ అనేది ప్రయాణికుల భద్రతకు ఎంతో కీలకమైనది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సర్కార్ కొత్త నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనదారులు కూడా టూరిస్ట్ పర్మిట్లను వినియోగించవచ్చు. ఏడాది పన్నును ఒకేసారి కట్టవచ్చు. అలాగే వైట్ నంబర్ ప్లేట్ వాహనదారులు కూడా ఈ టూరిస్ట్ పర్మిట్లు తీసుకోవచ్చు.
కాగా, ఇప్పటికే ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధి కష్టంగా మారింది. తాజా మార్గదర్శకాల వల్ల ట్యాక్సీ డ్రైవర్లు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల జతీయ రహదారులపై వాహనాల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. క్యాబ్ డ్రైవర్ల లైసెన్స్‌లు, వారి వాహనాల ఫిట్‌నెస్ ఎప్పటికప్పుడు రవాణాశాఖ అధికారులు తనిఖీలు ఉండవు. అందువల్ల ప్రయాణికుల భద్రత, ట్యాక్సీ డ్రైవర్ల జీవనోపాధి పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ విధానాన్ని వెనక్కి తీసుకుంది.
ఇవీ చదవండి: Petrol Diesel Rates: ఏప్రిల్ ఫస్ట్ సామాన్యులకు గుడ్ న్యూస్.. పరుగుల పెట్టిన పెట్రో ధరలకు బ్రేక్..