Income Tax Rules: అమల్లోకి వచ్చిన కొత్త ట్యాక్స్ నియమాలు… అవగాహన పెంచుకోవాలంటున్న ఆర్థిక నిపుణులు
New Income Tax Rules: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను నియమాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్పులను ప్రకటించింది.2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి...
New Income Tax Rules: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను నియమాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్పులను ప్రకటించింది.2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి సంబంధిత ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 2021 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త ఆదాయపు పన్ను నియమాలపై ట్యాక్స్ చెల్లింపుదారులు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త ప్రతిపాదనలు, ప్రజల ఆర్థిక లక్ష్యాలపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
రిటర్నుల దాఖలుకు సమయం కుదింపు
ఆలస్యమైన లేదా సవరించిన రిటర్నులను దాఖలు చేయడానికి సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇంతకు ముందు ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరు తేదీగా ఉఆండేది. ఒక వేళ ఆలోపు రిటర్నులు సమర్పించకపోతే, ఆలస్య రుసుముతో తర్వాత సంవత్సరంలోని మార్చి 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ గడువు లోపు పాత రిటర్నులను సవరించుకోవచ్చు. కానీ 2021-22 ఆర్థిక బిల్లులో ఈ సమయాన్ని మూడు నెలలు తగ్గించాలనే ప్రతిపాదన ఉంది. అంటే ఇప్పటి నుంచి ఆలస్యమైన, సవరించిన రిటర్నులను ఆ ఏడాదిలోని డిసెంబర్ 31లోపు సమర్పించాల్సి ఉంటుంది.
ట్యాక్స్ చెల్లింపు ఆప్షన్లు
పన్ను చెల్లింపుదారులకు అధిక పన్ను భారం నుంచి గట్టెక్కేందుకు 2020-21 బడ్జెట్‌లో కొత్త ట్యాక్స్ చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాత, కొత్త విధానాల్లో ట్యాక్స్ భారం తగ్గే ఆప్షన్‌ను పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు. తగ్గింపులు, మినహాయింపులు, అలవెన్స్‌ల ప్రయోజనాలను ట్యాక్స్ పేయర్లు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది నుంచి రెండింటిలో ఎక్కువ లబ్ది చేకూర్చే ఏదో ఒక ఆప్షన్‌ను ట్యాక్స్ చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు.
ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లపై ట్యాక్స్
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంలో ఈపీఎఫ్ జమ అయ్యే ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలు దాటితే నిధులు విత్ డ్రా చేసే దశలో పన్ను వర్తిస్తుంది. ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే ఉద్యోగులు, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌కు ఎక్కువ నిధులు కేటాయించే వారు ఇప్పుడు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఉద్యోగి తరపున ఈపీఎఫ్‌లో నిధులు జమ చేయాని యాజమాన్యాల విషయంలో ఈ ట్యాక్స్ మినహాయింపు పరిమితి రూ.5 లక్షలుగా ఉంది.
డివిడెంట్‌పై పన్ను
ఇంతకు ముందు కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ హౌస్‌ల నుంచి వ్యక్తులు అందుకునే డివిడెంట్ ట్యాక్స్ పరిధిలో లేదు. ఎందుకంటే డివిడెంట్‌పై ట్యాక్స్‌ను కంపెనీలే చెల్లించేవి. కానీ 2020 బడ్జెట్‌లో డివిడెంట్ ఆదాయంపై మినహాయింపులను ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు లబ్ధిదారులు డివిడెండ్ రూపంలో పొందే ఆదాయంపై పన్ను కట్టాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: SBI Interest Rates: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్..ఆ వడ్డీ రేటు భారీగా పెంపు..ఎంత పెంచారంటే..
Covid-19: కరోనా పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వైద్యులు, వైద్య సిబ్బందికి శుభవార్త
Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ఉచితంగా బీర్ .. మందు బాబులకు అదిరిపోయే ఆఫర్