Blast: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. భీతావహంగా మారిన ఘటనా స్థలి..
తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చెన్నైలోని నామక్కల్ లోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వేకువ జామున జరిగిన ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి...

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చెన్నైలోని నామక్కల్ లోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వేకువ జామున జరిగిన ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కలా ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని, మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. దేశమంతా కొత్త సంవత్సర వేడుకలకు ముస్తాబవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర విషాదం నింపింది.
కాగా.. గతంలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కడియద్ధ గ్రామ సమీపంలో బాణాసంచా తయారీ యూనిట్ నాలుగేళ్లుగా నడుస్తోంది. వారిలో స్థానికులు తమ పని ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. దాంతో అక్కడే ఉంటున్న వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 18 ఏళ్ల వయసులోపు వారే కావడం ఆందోళన కలిగించే విషయం.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి



