Medico as Sarpanch: జార్జియా నుంచి వచ్చి.. సర్పంచిగా గెలిచిన మెడికో.. ఇది కదా ఇన్స్పిరేషన్ అంటే..

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Dec 31, 2022 | 8:36 AM

మహారాష్ట్రలోని మిరాజ్‌ సంగ్లీ జిల్లా వడ్డి గ్రామ సర్పంచిగా యశోదర రాజే షిండే అనే 21 యువతి ఎన్నికయ్యారు. గత మూడేళ్లుగా ఈమె జార్జియాలోని న్యూ విజన్‌


విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న ఓ యువతి.. సొంతూరులో సర్పంచిగా గెలుపొందింది. కుటుంబం పిలుపుతో స్వదేశానికి తిరిగివచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచింది. మహారాష్ట్రలోని మిరాజ్‌ సంగ్లీ జిల్లా వడ్డి గ్రామ సర్పంచిగా యశోదర రాజే షిండే అనే 21 యువతి ఎన్నికయ్యారు. గత మూడేళ్లుగా ఈమె జార్జియాలోని న్యూ విజన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు గ్రామంలో జరిగిన సమాలోచనల్లో మహేంద్రసింగ్‌ షిండే కుమార్తె యశోదర రాజేను ఎన్నికల్లో నిలబెట్టాలని నిర్ణయించారు. షిండే కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతోంది. వడ్డి గ్రామానికి పక్కనే ఉన్న నర్వాడ్‌ పంచాయతీ సర్పంచిగా యశోదర పూర్వీకులు 30 ఏళ్లు సేవలందించారు. ఈ నేపథ్యంలో పెద్దగా సన్నద్ధత లేకుండానే యశోదర బరిలోకి దిగారు. సిట్టింగ్‌ సర్పంచిపై 149 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచినప్పటికీ చదువును వదిలిపెట్టబోనని యశోదర చెబుతున్నారు. ఇటు గ్రామ శ్రేయస్సు కోసం పాటుపడతానన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu