AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RG Kar Case: CBI విచారణలో బయటపడుతున్న మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్ అక్రమాల పుట్ట!

యువ వైద్యురాలిపై దారుణం జరిగిన ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. అయితే హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

RG Kar Case: CBI విచారణలో బయటపడుతున్న మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్ అక్రమాల పుట్ట!
Dr. Sandip Ghosh
Balaraju Goud
|

Updated on: Sep 08, 2024 | 12:13 PM

Share

యువ వైద్యురాలిపై దారుణం జరిగిన ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. అయితే హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) జరిపిన విచారణలో సంచలన విషయాలు రాబట్టింది. కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. హాస్పిటల్‌లోని మెడికల్ హౌస్ సిబ్బంది రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవకతవకలు చేసి వైద్యులను నియమించారని తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించి ఆసుపత్రి కాంట్రాక్టును తన సన్నిహితులకు ఇచ్చారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అక్రమ సంపాదన కోసం నేరసంబంధం కలిగి ఉన్నారని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. సందీప్ ఘోష్ హౌస్ సిబ్బంది నియామకం కోసం ఇంటర్వ్యూల కోసం ఎక్కడా పారదర్శక పాటించలేదని సీబీఐ పేర్కొంది. ఆసుపత్రిలో ఇంటర్వ్యూ కోసం ప్యానెల్ ప్రక్రియ లేదని నిర్ధారించింది. నియామకానికి ముందు ఇంటర్వ్యూలో వచ్చి చివరి మార్కులు మాత్రమే విడుదల చేశారని సీబీఐ గుర్తించింది.

అంతేకాదు, సందీప్ ఘోష్ నియమించిన చాలా మంది వైద్యులకు అర్హత కలిగిన వైద్యులు లేరని సీబీఐ ఆరోపించింది. సమర్థులైన వైద్యులకు అవకాశం ఇవ్వకుండా అనుభవం తక్కువగా ఉన్న వైద్యులకు అవకాశం కల్పించారు. ఆయన సెక్యూరిటీ గార్డు భార్య నర్గీస్‌కు హాస్పిటల్ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎలా వచ్చిందనే దానిపై కూడా సీబీఐ విచారణ జరుపుతోంది. నిబంధనలను ఉల్లంఘించి నర్గీస్ కంపెనీని ఇషాన్ కేఫ్‌కు ఇచ్చారని దర్యాప్తు సంస్థ తెలిపింది. నర్గీస్ క్యాంటీన్ కాంట్రాక్టు ముందుగానే ఇచ్చినట్లు మీడియా కథనంలో పేర్కొంది. అంతే కాకుండా క్యాంటీన్ టెండర్ మొత్తం కూడా చేతిరాతతో ఉన్నట్లు గుర్తించారు.

డా. సందీప్ ఘోష్ సెక్యూరిటీ గార్డు భార్య నర్గీస్ సంస్థకు నాన్ రిఫండబుల్ డబ్బును కూడా తిరిగి ఇచ్చాడు. ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని నిరూపించే ఆధారాలను సీబీఐ సేకరించిందని సంబంధిత అధికారి తెలిపారు. ఆసుపత్రిలోని బయోమెడికల్ వ్యర్థాలను విక్రయించేందుకు తమ సెక్యూరిటీ గార్డు విక్రేతలతో ఒప్పందాలు కుదుర్చుకునేవాడని దర్యాప్తు సంస్థ తెలిపింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సందీప్ ఘోష్, ఇద్దరు విక్రేతలు, వారి సెక్యూరిటీ గార్డును సిబిఐ అరెస్టు చేసింది. ఈ విక్రేతలు ఇద్దరూ ఘోష్ పనిచేసిన ముర్షిదాబాద్‌ ఆస్పత్రికి చెందినవారుగా సీబీఐ గుర్తించింది. ఘోష్ వారిని RG కర్ హాస్పిటల్‌కు ప్రిన్సిపాల్‌గా చేసినప్పుడు కోల్‌కతాకు తీసుకువచ్చారు. ఆసుపత్రికి మెటీరియల్ సరఫరా చేయడంలో వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సీబీఐ అధికారి వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..