Bharat Jodo Yatra: రాహుల్‌తో కలిసి అడుగులేసిన ‘రా’ మాజీ చీఫ్.. యూపీలో జోరుగా భారత్ జోడో యాత్ర..
కాంగ్రెస్ నేతం రాహుల్ గాంధీ జోడో యాత్రకు రోజురోజు మద్దతు పెరుగుతుంది. మద్థతు ఎంతలా? అంటే .. చివరకు బీజేపీ వాళ్ళు కూడ స్వాగతం పలుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర తొమ్మిది రోజుల విరామం తర్వాత కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించింది. అయితే, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి “రా” మాజీ చీఫ్ ఎఎస్ దులత్ ముందుకు నడిచారు. అంతేకాదు యూపీ లో అడుగు పెట్టిన భారత్ జోడో యాత్రకు రామమందిర్ ట్రస్ట్ మద్దతు ప్రకటించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మార్పులకు సంకేతమా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భాగ్‌పత్‌లోని బరౌలీలోని బీజేపీ కార్యాలయం మీదుగా రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ సాగుతుండగా అక్కడ ఉన్న బీజేపీకి చెందిన వారు స్వాగతం పలికారంటూ ట్వీట్ చేశారు.
అలాగే రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్, రామ్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ఇటీవల రాహుల్ గాంధీని అభినందిస్తూ మద్దతు లేఖ కూడ ఇచ్చారు. భారత్ జోడో యాత్రను స్వాగతిస్తూ అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఇటీవల లేఖ రాశారు. వీహెచ్‌పీ నేతలైన చంపత్ రాయ్ వంటి నేతలు రాహుల్ గాంధీని ప్రశంసించారు. దీని తర్వాత ఇవాళ భాగ్‌పత్‌లోని బరౌలీలో బీజేపీ కార్యాలయంలో ఉన్న వారు ఉత్సాహంగా చేతులు ఊపుతూ యాత్రకు స్వాగతం పలికారు’ అని జైరాం రమేష్ హిందీలో ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ యాత్ర గురించి చంపత్ రాయ్ స్పందిస్తూ, రాహుల్ ఎంతో ఇబ్బందికర వాతావరణంలో పాదయాత్ర చేస్తున్నారని, దీనిని తప్పనిసరిగా మెచ్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా యాత్ర చేయాలన్నారు. తాను ఆరెస్సెస్ కార్యకర్తనని, భారత్ జోడో యాత్రను ఆరెస్సెస్ ఎప్పుడూ ఖండించలేదని తెలిపారు.
అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గత ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. డిసెంబర్ 24న ఢిల్లీలో జరిగిన మార్చ్‌లో నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు. ఇంకా, బాలీవుడ్ నటీనటులు పూజా భట్, స్వర భాస్కర్ తదితరులు కూడా ఈ మార్చ్‌లో రాహుల్ గాంధీ వెంట నడిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..