Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం దారిమళ్లింపు.. ఢిల్లీ నుంచి అగర్తలా అటు నుంచి..
అగర్తల మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్ చేయబడింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని దారిమళ్లించారు. బుధవారం గౌహతిలోని గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి గత రాత్రి అమిత్ షా అగర్తలా చేరుకోవాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన విమానం రాత్రి 10.45 గంటలకు గౌహతిలో ల్యాండ్ అయింది. అమిత్ షా షెడ్యూల్ ప్రకారం, ఈరోజు ఈశాన్య రాష్ట్రంలో రెండు రథయాత్రలు జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమ త్రిపుర పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శంకర్ దేబ్‌నాథ్ ఈ వివరాలను అందించారు. “కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి 10 గంటలకు MBB విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా విమానానికి దారి కనిపించకపోవడంతో MBB విమానాశ్రయానికి వెళ్లాల్సిన విమానం గౌహతిలో దిగిందని తెలిపారు. బుధవారం రాత్రికి అక్కడే ఉన్నారని తెలిపారు.
Honoured to receive Adarniya Griha Mantri Shri @AmitShah ji at LGBI Airport, Guwahati ahead of his visit to Tripura tomorrow.
We’ve always been blessed by the generous guidance of Hon HM. pic.twitter.com/sn6cszosZo
— Himanta Biswa Sarma (@himantabiswa) January 4, 2023
అగర్తలా 11 గంటలకు చేరుకోవాల్సి ఉంది..
ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్ మరియు దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్ సబ్ డివిజన్ నుండి రథయాత్రను జెండా ఊపి ప్రారంభించేందుకు షా గురువారం ఉదయం 11 గంటలకు అగర్తల చేరుకుంటారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచార్య తెలిపారు. జన్ విశ్వాస్ యాత్ర వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచారానికి గుర్తుగా ఉంటుందని, రెండు కార్యక్రమాలను కేంద్ర హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించడం మాకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి మాణిక్ సాహా రోజు విలేకరులతో అన్నారు.
షా తొలుత ధర్మానగర్‌కు వెళ్లి అక్కడ యాత్రను జెండా ఊపి ర్యాలీలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తాను సబ్రూమ్‌కు వెళ్తానని, అక్కడ మరో రథయాత్ర ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తానని సాహా చెప్పారు. సబ్రూమ్ కార్యక్రమం అనంతరం షా తిరిగి అగర్తలా వెళ్లి గురువారం సాయంత్రం త్రిపురకు బయలుదేరి వెళతారని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం