AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sujan Singh Pathania Passes Away: హిమాచల్‌ప్రదేశ్ మాజీ మంత్రి సుజన్ సింగ్ కన్నుమూత.. పలువురి నేతల సంతాపం

Sujan Singh Pathania Passes Away: హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుజన్‌సింగ్‌ పటానియా (78) శుక్రవారం మరణించారు. కంగ్రా జిల్లా.

Sujan Singh Pathania Passes Away: హిమాచల్‌ప్రదేశ్ మాజీ మంత్రి సుజన్ సింగ్ కన్నుమూత.. పలువురి నేతల సంతాపం
Subhash Goud
|

Updated on: Feb 12, 2021 | 2:14 PM

Share

Sujan Singh Pathania Passes Away: హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుజన్‌సింగ్‌ పటానియా (78) శుక్రవారం మరణించారు. కంగ్రా జిల్లా ఫతేపూర్‌ ఎమ్మెల్యే అయన సుజన్‌సింగ్‌ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుజన్‌సింగ్‌ ఏడోసారి హిమాచల్‌ ప్రదేశ్‌ విధాన సభకు పునర్‌ ఎన్నికయ్యారు. 2017లో సుజన్‌ సింగ్‌ పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. సుజన్‌ 1977, 1990, 1993, 2003, 2009, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. ఈయన వ్యవసాయ, రవాణ, విద్యుత్‌ శాఖల మంత్రిగా పని చేశారు. సుజన్‌సింగ్‌ మృతి పట్ల పలువురు కాంగ్రెస్‌ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు.

Also Read: Chanda Kochhar: వీడియోకాన్‌కు రుణం ఇచ్చిన కేసులో ముంబైలో సెషన్స్‌ కోర్టుకు హాజరైన చందాకొచ్చర్‌