AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs China మీ తాతని అడిగితే సమాధానం తెలుస్తుంది.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి..

India vs China: భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తోన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి..

India vs China మీ తాతని అడిగితే సమాధానం తెలుస్తుంది.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి..
Kishan Reddy
Shiva Prajapati
|

Updated on: Feb 12, 2021 | 2:07 PM

Share

India vs China: భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తోన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. భారతదేశ భూభాగం ఎవరి హయాంలో అక్రమణకు గురైందో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అదే సమయంలో భారత భూభాగాన్ని చైనాకు ఎవరు ఇచ్చారో తెలియాలంటే రాహుల్ గాంధీ తన తాత(జవహార్ లాల్ నెహ్రూ)ని అడిగితే సరైన సమాధానం వస్తుందంటూ కిషన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యానించారు. ఎవరు దేశ భక్తులో, ఎవరు కాదో ప్రజలకు అన్నీ తెలుసునని అన్నారు.

గత కొంతకాలంగా భారత్-చైనా సరిహద్దుల్లో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత భూభాగాన్ని చైనా అక్రమించిందిన పలు జాతీయ మీడియా సంస్థలు వార్తలను కూడా ప్రసారం చేశాయి. చైనా దురాక్రమణకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. భారతదేశాన్ని చైనా అక్రమిస్తుంటే కేంద్రం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్లే సరిహద్దుల్లో చైనా దూకుడు విధానాలను అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANI Tweet:

Also read:

బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తున్నారా ? ఎదురయ్యే ఈ సమస్యల గురించి నిపుణుల సూచనలు..

Indian Railways : భారతీయ రైళ్లకు అత్యంత ఆధునిక హంగులు.. విమాన ప్రయాణంను తలపించేలా కోచుల తయారీ..