Delhi Airport: ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం..
దేశ రాజధానిలో వాయుకాలుష్యం రోజు రోజుకూ కోరలు చాస్తోంది. అసలే చలికాలం.. పొగ మంచు దట్టంగా కమ్మేసింది. పైగా వాయునాణ్యతా సూచీలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో రోడ్లపై ప్రజలు కనిపించడం కూడా కష్టంగా మారింది. పూర్తి మసకబారిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయి. ఉత్తర భారతంపై చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.

దేశ రాజధానిలో వాయుకాలుష్యం రోజు రోజుకూ కోరలు చాస్తోంది. అసలే చలికాలం.. పొగ మంచు దట్టంగా కమ్మేసింది. పైగా వాయునాణ్యతా సూచీలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో రోడ్లపై ప్రజలు కనిపించడం కూడా కష్టంగా మారింది. పూర్తి మసకబారిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయి. ఉత్తర భారతంపై చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అయితే పరిస్థితి ఈరోజు కూడా అలాగే కొనసాగుతోంది.
దీంతో ఉదయం 08.30 నుంచి 10 గంటల వరకూ ఢిల్లీకి చేరుకోవలస్సిన విమానాలను దారిమళ్ళించారు అధికారులు. ఐదు విమానాలను జైపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. ఈరోజు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోవడంతో రహదారులు మొత్తం పొగ మంచు కప్పేసింది. విజిబిలిటీ పరిమితి 150 మీటర్లకు పడిపోయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు నొయిడా, హజరత్ నిజాముద్దీన్ ప్రాంతాల్లో విజిబిలిటీ 500 మీటర్లుగా నమోదయింది. ఈరోజు ఇలా ఉంటే నిన్న పూర్తి స్థాయిలో విజిబిలిటీ పడిపోయిందని తెలిపారు.
గత నెలలో తీవ్రమైన వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు అవస్థలు పడ్డారు. వాయునాణ్యతా సూచీలు తీవ్ర రూపం దాల్చడంతో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి అతిషా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల్లో పొగ వెలువడకుండా ఉత్పత్తిని నిలిపివేశారు అధికారులు. ఇదంతా మన్నటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలు. ఇదిలా ఉంటే తాజాగా పంజాబ్, హరియాణా, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, కలకత్తా, ఒడిశాలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. చండీగఢ్, బిహార్, త్రిపురలో తక్కువ మోతాదులో మంచు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. మన్నటి వరకూ కాలుష్యంతో సతమతమైన ఢిల్లీ వాసులు.. ఇప్పుడు దట్టమైన పొగమంచు కారణంగా తీవ్ర చలికి, అనారోగ్యాలకు గురవుతున్నారు. మరి కొన్ని రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని సూచిస్తున్నారు ఐఎండీ అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..