INS Imphal: భారత్ అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. ముంబై నావల్ డాక్‌యార్డ్ నుంచి జలప్రవేశం
మణిపూర్ రాజధాని ఇంఫాల్ పేరు మీద ఈ యుద్దనౌకను నిర్మించారు. నేవీలో కమీషన్ చేయడానికి ముందు అన్ని రకాలుగా పరీక్షించారు. INS ఇంఫాల్ నుంచి సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించారు. డిస్ట్రాయర్ యుద్ధనౌక ఇంఫాల్‌ను నడపడానికి.. దానిలో 4 గ్యాస్ టర్బైన్‌లను అమర్చారు.

డ్రాగన్‌కు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని రకాలుగా రెడీ అవుతోంది. జల, వాయు, భూతలం నుంచి చైనా చేస్తున్న దాడులను తిప్పి కొట్టేలా సన్నద్ధం అవుతోంది. ముంబైలో INS ఇంఫాల్ జల ప్రవేశం చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌక అందుబాటులోకి రావడంతో ఇండియన్ నేవీ అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమయంలో ఈ యుద్దనౌక జల ప్రవేశం జరిగింది. ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమానికి రాజ్‌నాథ్‌తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌షిండే కూడా హాజరయ్యారు.
INS ఇంఫాల్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. కొత్త స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ ఇది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ లాగే ఇండియన్ నేవీ కూడా అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు, విధ్వంసక యుద్ధ నౌకలను సమకూర్చుకుంటోంది. ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్‌ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశారు. శత్రువుల రాడార్‌ను సైతం ఢీకొని ముందుకు సాగడం దీని ప్రత్యేకత. అయితే దాన్ని శత్రువు రాడార్ కూడా గుర్తించకుండా ఉండటం మరో ప్రత్యేకత. అలాంటి సమయంలో ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ తనకు ఇచ్చిన ఆపరేషన్‌ను నిర్వర్తిస్తుంది. గతంలో ఆర్మీకి , ఎయిర్‌ఫోర్స్‌కు ఎక్కువ నిధులు కేటాయించారని, ప్రధాని మోదీ అధికారం చేపట్టాక నేవీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
INS ఇంఫాల్‌లో ఉపరితలం నుంచి ఉపరితలానికి.. ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను కూడా కలిగి ఉంటుంది. యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్ కోసం బ్రహ్మోస్ యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థను కూడా ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్‌లో ఏర్పాటు చేశారు. భారత్‌కు చెందిన ఈ ప్రమాదకరమైన డెస్ట్రాయర్ యుద్ధ నౌకను అంతర్గత సంస్థ వార్‌షిప్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది. దీనిని మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ మొత్తం సామర్థ్యం 7400 టన్నులు కాగా.. మొత్తం పొడవు 164 మీటర్లు. ప్రమాదకరమైన క్షిపణులతో పాటు ఇది యాంటీ షిప్ క్షిపణులు, టార్పెడోలు, ఇతర ఆధునిక ఆయుధాలు, సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ పేరు మీద ఈ యుద్దనౌకను నిర్మించారు. నేవీలో కమీషన్ చేయడానికి ముందు అన్ని రకాలుగా పరీక్షించారు. INS ఇంఫాల్ నుంచి సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించారు. డిస్ట్రాయర్ యుద్ధనౌక ఇంఫాల్‌ను నడపడానికి.. దానిలో 4 గ్యాస్ టర్బైన్‌లను అమర్చారు. దీని వేగం 30 నాట్స్ కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
షిప్ డ్రోన్ దాడిపై రాజ్‌నాథ్ సింగ్
ఇదిలావుంటేచ ఇటీవల జరిగిన ఎంవీ కెమ్ ప్లూటో నౌకపై డ్రోన్ దాడిపై తొలిసారిగా స్పందించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి కేసులో భారత ప్రభుత్వం దోషులను విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి ఎక్కడ దాక్కున్నా, దొరుకుతారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారతదేశం సముద్రతీరంలో అలజడి మరింత తీవ్రమైందన్న ఆయన.. కెమ్ ప్లూటో, సాయిబాబా అనే రెండు భారత నౌకలపై దాడి జరిగడం దారుణమన్నారు. ఇది ఎవరు చేసినా, వారిని సముద్రపు లోతుల్లోంచి బయటికి తీసుకొచ్చి, వారికి గుణపాఠం చెబుతామన్నారు.
డిసెంబర్ 23న పోర్‌బందర్‌కు 217 నాటికల్ మైళ్ల దూరంలో 21 మంది భారతీయ సిబ్బందిని తీసుకువెళుతున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. దాడి రకం, ఉపయోగించిన పేలుడు పదార్థాల పరిమాణాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణ జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…