Corona vaccine: భారత్ టీకాపై ప్రపంచ దేశాల దృష్టి.. ఆశాజనకంగా వస్తున్న వ్యాక్సిన్ ఫలితాలు..
భారత్ బయోటక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది.

భారత్ బయోటక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న తొల, రెండో దశ ప్రయోగాల్లో సత్పలితాలు రావడంతో మూడో దశ కొనసాగుతుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ భద్రత మరియు రోగనిరోధకత విషయంలో ఎంతో ఆశాజనకంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ ఈ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలను ప్రచురించేందుకు ముందుకు వచ్చిందని తెలిపింది. అటు ప్రస్తుతం ఇండియాలో మొత్తం 22 ప్రాంతాల్లో మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపింది.
ఐసీఎంఆర్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ను రూపొందించింది. ప్రస్తుతం మూడో దశలో ఇప్పటి వరకు 13 వేల మంది వాలంటీర్లపై క్లినికల్ పరీక్షలు పూర్తయినట్లుగా తెలిపింది. అటు మరికొన్ని ప్రాంతాలలో 13 వేల మందికి ఈ వాక్సిన్ పరీక్షలు చేయనున్నటులాగ తెలిపింది. ఈ టీకా ప్రయోగించిన అనంతరం వారిలో ఇమ్యునోజెనిసిటీ ఫలితాలు సరిగా ఉన్నట్లు తెలిపింది.




