సిని ఇండస్ట్రీలో మరో విషాదం.. స్నానానికి వెళ్ళి ప్రముఖ నటుడు కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. గత రెండు రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు సానవాస్ మరణం మరువక ముందే మరో నటుడు మృతి చెందాడు.

సిని ఇండస్ట్రీలో మరో విషాదం.. స్నానానికి వెళ్ళి ప్రముఖ నటుడు కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 25, 2020 | 8:21 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. గత రెండు రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు సానవాస్ మరణం మరువక ముందే మరో నటుడు మృతి చెందాడు. మలయాళ నటుడు అనిల్ పి నేదుమంగాడ్ నీటిలో మునిగి కన్నుమూశారు. వివరాల్లోకెళితే.. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మువత్తుపుళలోని మలంకర డ్యామ్‏లో ప్రమాదవశాత్తు అనిల్ మునిగి మరణించారు. శుక్రవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి డ్యామ్‏లో స్నానం చేస్తుండగా అనిల్ నీటమునిగిపోయారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అతడిని తరలించగా.. డాక్టర్లు పరీక్షించి అనిల్ మరణించినట్లుగా తెలిపారు. కాగా తిరువనంతపురానికి చెందిన అనిల్ కమ్మతిపాడమ్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజీవ్ రవి చిత్రం కమ్మట్టిపాడోమ్‏లో విలన్‏గా నటించారు. కాగా చనిపోవడానికి కొన్ని గంటల ముందు అనిల్ తన ఫేస్‏బుక్‏లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది జూన్‏లో మరణించిన అయ్యపనమ్ కోషియం డైరెక్టర్ కె.ఆర్ సచిదందన్‎ను తలుచుకుంటూ.. చనిపోయేవరకు మీరు నా ఫేస్‏బుక్ కవర్ ఫోటోలో ఉంటారంటూ రాశారు. అటు అనిల్ మృతిపై పృథ్వీరాజ్, దుల్కర్, సల్మాన్ సహా, మలయాళ చిత్ర ప్రముఖులు దిగ్ర్భాంత్రి వ్యక్తం చేశారు.