జక్కన చెక్కుతున్న శిల్పం.. తెలుగు నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న బాలీవుడ్ బ్యూటీ

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్

  • Rajeev Rayala
  • Publish Date - 8:17 pm, Fri, 25 December 20
జక్కన చెక్కుతున్న శిల్పం.. తెలుగు నేర్చుకోవడానికి తిప్పలు పడుతున్న బాలీవుడ్ బ్యూటీ

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. తారక్ కొమరం భీమ్ గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నాడు.  కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ మూవీని.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దానయ్య నిర్మిస్తున్నారు.‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అలియా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భామ చరణ్ సరసన సీత పాత్రలో నటించనుంది.

ఇప్పుడు ఈ బ్యూటీకి ఎక్కడాలేని కష్టం వచ్చిపడింది. అదేంటో కాదు తెలుగు . బాడీ లాంగ్వేజ్ తో సమానంగా డైలాగ్ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని ఆర్డర్ వేశాడట దర్శకధీరుడు.దాంతో ఈ అమ్మడు తెలుగు నేర్చుకునేపనిలో పడింది. గత ఏడాదిన్నర కాలంగా తెలుగు ప్రాక్టీస్ చేస్తోందట అలియా భట్.  మరి ఈ  బాలీవుడ్ భామ తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడాలి. ఎంతైనా జక్కన చెప్కకుతున్న శిల్పం కదా తెలుగు చక్కగానే మాట్లాడుతుందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగు అలియాకు మరిన్ని చాన్సు వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ మరో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవ్గన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది దసరా నాటికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు రాజమోళి.