టాలీవుడ్ లో రాణించాలని చూస్తున్న అందాల భామ.. శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సురభి

టాలీవుడ్ల్ లో ఇలా వచ్చి అలా వెళ్లిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా రాణించాలని ప్రయత్నిస్తున్న హీరోయిన్లు కోకొల్లలుగా ఉన్నారు.

టాలీవుడ్ లో రాణించాలని చూస్తున్న అందాల భామ.. శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సురభి
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 25, 2020 | 7:57 PM

టాలీవుడ్ల్ లో ఇలా వచ్చి అలా వెళ్లిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా రాణించాలని ప్రయత్నిస్తున్న హీరోయిన్లు కోకొల్లలుగా ఉన్నారు. అయితే చక్కని లావణ్యంతో ఆకర్షించే చూపులతో కుర్రాళ్లను ఆకట్టుకుంది అందాల భామ సురభి. ఈ అమ్మడు నటించింది కొన్ని సినిమాలే అయినా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్ సరసన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలో నటించింది. ఆతర్వాత నాని నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమాలో అలరించింది.

ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న సురభికి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ‘ఒక్క క్షణం’ .. ‘ఓటర్’ సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం సురభి చేతిలో రెండు టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి అది సాయికుమార్ నటిస్తున్న శశి ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విదులైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మరో సినిమాను కూడా సురభి ఓకే చేసిందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ లో ఈ అందాల భామ రాణించే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రెండు సినిమాలు అమ్మడి కెరియర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి