Tea: పెను విషాదం.. టీ తాగి ఐదుగురు దుర్మరణం.. ఆ చిన్న పొరపాటు కారణంగా..

టీ.. ఉదయం లేవగానే వేడి వేడి తేనీరును సేవిస్తే వచ్చే కిక్కే వేరు. చాలా మందికి టీ తాగనిదే రోజు గడవదు. అంతగా మన జీవితంలో భాగమైన టీ.. ఐదుగురి ప్రాణాలు తీసింది. ఓ ఇల్లాలు చేసిన పొరపాటుకు ఐదు నిండు ప్రాణాలు..

Tea: పెను విషాదం.. టీ తాగి ఐదుగురు దుర్మరణం.. ఆ చిన్న పొరపాటు కారణంగా..
Tea
Follow us

|

Updated on: Oct 28, 2022 | 7:51 AM

టీ.. ఉదయం లేవగానే వేడి వేడి తేనీరును సేవిస్తే వచ్చే కిక్కే వేరు. చాలా మందికి టీ తాగనిదే రోజు గడవదు. అంతగా మన జీవితంలో భాగమైన టీ.. ఐదుగురి ప్రాణాలు తీసింది. ఓ ఇల్లాలు చేసిన పొరపాటుకు ఐదు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో జరిగింది. నాగ్లా కన్హై గ్రామంలో శివానందన్ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి శివంగ్, దివ్యాన్ష్, ఇద్దరు కుమారులు. వీరితో పాటు అతని మామ రవీంద్రసింగ్ కూడా కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో పొరుగింట్లో ఉండే సోబ్రాన్.. టీ తాగేందుకని శివానందన్ ఇంటికి వచ్చాడు. వారికి శివానందన్ భార్య టీ కాచి ఇచ్చింది. అయితే చాయ్ తాగిన తర్వాత వారందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రవీంద్రసింగ్‌, శివాంగ్, దివ్యాన్ష్‌ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోబ్రాన్‌, శివానందన్‌ల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం సైఫాయి ఆస్పత్రికి తరలించగా అక్కడ వారిద్దరూ ప్రాణాలు విడిచారు.

భయ్యా దూజ్ సందర్భంగా శివానందన్ తండ్రి రవీంద్ర సింగ్ బుధవారం వారి ఇంటికి వచ్చారు. రవీంద్ర బంధువు సోబ్రాన్ సింగ్ కూడా అదే గ్రామంలోని మరొకరి ఇంటికి వచ్చాడు. అతనిని రవీంద్ర తన కూతురి ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో సదరు మహిళ కుటుంబ సభ్యులందరికీ టీ తయారు చేసింది. భయ్యా దూజ్ సందర్భంగా ఆమె ఉపవాసం ఉంటోంది. దీంతో ఆమె టీ తాగకుండా స్నానానికి వెళ్లింది. పని ముగించుకుని వచ్చి చూడగా టీ తాగిన వారందరూ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ఆమె స్పృహ కోల్పోయింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలంలో టీ తయారీకి సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. వరి పంటలో పిచికారీ చేసే మందును పొరపాటున టీ పొడి అనుకొని కలిపేయడంతో అది విషపూరితమై ఈ పెను విషాదానికి కారణమైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఎస్పీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..