Bharat Jodo Yatra: ప్రజలలో ఆలోచన మారాలి.. వారికి ఎం కావాలో తెలుసుకోవాలి.. భారత్ జోడో యాత్రలో రాహుల్..

Bharat Jodo Yatra: ప్రజలలో ఆలోచన మారాలి.. వారికి ఎం కావాలో తెలుసుకోవాలి.. భారత్ జోడో యాత్రలో రాహుల్..

Anil kumar poka

|

Updated on: Oct 28, 2022 | 7:58 AM

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందకు ఆ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ..


కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందకు ఆ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ అక్టోబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం ఎల్లిగండ్ల నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గోప్లపూర్ కలాన్ చేరుకుంటుంది. సాయంత్రానికి పాదయాత్ర మన్యంకొండ చేరుకుంటుంది. రాత్రికి ధర్మపూర్ లో రాహుల్ గాంధీ బస చేస్తారు. తన పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఈ యాత్రలో ఈరోజు రాహుల్ గాంధీతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసీసీ) నాయకులు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, టీపీసీసీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా రహదారి పక్కన ఉన్న పాఠశాల విద్యార్థులను పిలిచి వారితో కలిసి రాహుల్ గాంధీ కాసేపు నడిచారు.సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ పాదయాత్ర 51వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర పూర్తిచేసిన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 28, 2022 07:58 AM