TRS MLA Rega Kantha Rao: ఈరోజు పెద్ద సార్ ప్రెస్ మీట్.. సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంపై రేగా పోస్ట్‌..

TRS MLA Rega Kantha Rao: ఈరోజు పెద్ద సార్ ప్రెస్ మీట్.. సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంపై రేగా పోస్ట్‌..

Anil kumar poka

|

Updated on: Oct 28, 2022 | 12:55 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌ పెడతారని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ ప్రెస్‌ మీట్‌లో ఎమ్మెల్యేలకు ఎరపై అన్ని వివరాలు చెబుతారని అంటున్నారు. మరీ ఇవాళ సాయంత్రం కేసీఆర్‌ ఏం చెబుతారు? అనేది రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన టీఆర్ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారనే విషయం చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చేసిన చర్యలను తెలంగాణ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ దుష్ట చర్యలు, బీజేపీ నేతలు రాజ్యాంగం పట్ల అవహేళనగా ప్రవర్తిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 28, 2022 12:55 PM