దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ ఆపరేటర్ జోయా ఖాన్

దేశంలో ట్రాన్స్ జెండర్లకు కూడా ఇతరులతో సమానంగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జోయా ఖాన్ అనే ట్రాన్స్ జెండర్ ని గుజరాత్ లోని కామన్ సర్వీసు సెంటర్ లో..

దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ ఆపరేటర్ జోయా ఖాన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2020 | 7:22 PM

దేశంలో ట్రాన్స్ జెండర్లకు కూడా ఇతరులతో సమానంగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జోయా ఖాన్ అనే ట్రాన్స్ జెండర్ ని గుజరాత్ లోని కామన్ సర్వీసు సెంటర్ లో ఆపరేటర్ గా నియమించారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఇలాంటి కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. జోయా ఖాన్ అనే ఈమె దేశంలో ఆపరేటర్ జాబ్  పొందిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె వడోదరలో పని చేస్తోందన్నారు. టెలిమెడిసిన్ కన్సల్టేషన్ లో సిఎస్ సి వర్క్ ని ఈమె ప్రారంభించిందని, డిజిటల్ గా సాంకేతికంగా ట్రాన్స్ జెండర్లు అభివృధ్ది చెందాలన్నదే ఈమె ఉద్దేశమని ఆయన అన్నారు. జోయాఖాన్ తన విధి నిర్వహణలో ఉన్న ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. టెలిమెడిసిన్ సర్వీసులో భాగంగా రోగులు తమ సమీప కేంద్రం నుంచి వీడియో కాలింగ్ ద్వారా కన్సల్టేషన్ సౌకర్యాన్ని పొందనున్నారు.