బ్రేకింగ్: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న రెండు ఫ్యాక్టరీలకు ఈ మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. దాదాపు 22 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఢిల్లీలోని ఖిరారి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు […]

బ్రేకింగ్: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 9:03 AM

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న రెండు ఫ్యాక్టరీలకు ఈ మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. దాదాపు 22 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఢిల్లీలోని ఖిరారి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందగా.. 24గంటలు ముగియకముందే మరో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఇక ఈ నెల 8న ఢిల్లీలోని అనాజ్‌మండిలో గల ఒక ప్లాస్టిక్‌ సంచుల కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.