Viral Video: అరరే.. పండ్లమార్కెట్లో ఫైటింగ్ ఏంది గురూ..! మరీ అంతలా కొట్టుకోవాలా..? వైరలవుతున్న వీడియో
ఇదిలా ఉంటే, మార్కెట్లో వ్యాపారులు కొట్టుకున్న దృశ్యాలను కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్త నెట్టింట హల్‌చల్ చేస్తంఓది. నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.
సిమ్లాలోని పండ్ల మార్కెట్‌లో వ్యాపారుల మధ్య జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. వ్యాపారులు కొట్లాడుకుంటున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి బాగ్‌పత్ యుద్ధంగా పిలుస్తున్నారు. 2021లో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో ఇద్దరు చాట్ విక్రేతల మధ్య జరిగిన ఘర్షణ భారీ కోట్లాటకు దారి తీసిన సంఘటనను కొందరు గుర్తు చేశారు. తాజాగా సిమ్లా ఫ్రూట్ మార్కెట్ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణను ‘బాగ్‌పత్ ఫైట్ 2.0’గా కొందరు వ్యవహరిస్తున్నారు. పండ్ల వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. వ్యాపారులు ఒకరిపై ఒకరు ట్రేలు, కర్రలతో కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో జరిగింది. స్థానిక ఫ్రూట్ మార్కెట్‌లో పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు. ఖాళీగా ఉన్న ట్రేలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దల దాడి చేసుకున్నారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అప్పటికీ గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
Battle of Shimla Fruit Bazar. pic.twitter.com/0jg2LoTfAh
— News Arena India (@NewsArenaIndia) March 28, 2023
ఇదిలా ఉంటే, మార్కెట్లో వ్యాపారులు కొట్టుకున్న దృశ్యాలను కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్త నెట్టింట హల్‌చల్ చేస్తంఓది. నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..