ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీం.. ప్రాసెస్ చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయ్.. ఆ ఐస్ క్రీమ్ తింటేనా..?

చుట్టూ ఐస్ గడ్డలు వేసింది. స్టీల్ క్యాన్ హ్యాండిల్ కు తాడు కట్టేసింది. ఆ తాడు రెండో వైపున సీలింగ్ ప్యాన్ కు ముడేసింది. ఆ తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసింది. దాంతో ఫ్యాన్ వేగానికి కింద అల్యూమినియం పాత్రలో పెట్టిన స్టీల్ క్యాన్ తిరగడం ప్రారంభించింది.

ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీం.. ప్రాసెస్ చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయ్.. ఆ ఐస్ క్రీమ్ తింటేనా..?
Fan Made Ice Cream
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 30, 2023 | 6:31 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తనకు నచ్చిన అంశాలను పోస్టు చేస్తుంటారు. ఆనంద్‌ మహీంద్రా చేసిన ప్రతి పోస్ట్‌ ఆసక్తికరంగా, నెటిజన్లను ఆకట్టుకునేలా ఉంటుంది. తాజాగా ఆనంద్ మహీంద్రా  ఒక మహిళ తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ వీడియోని షేర్‌ చేశారు. దేశీ జుగాడ్‌ టెక్నిక్‌తో ఆమె తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. 2:30 సెకన్ల ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఊరిస్తుంది. ఐస్ క్రీమ్ తయారు చేసిన విధానం ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

సాధారణంగా ఐస్ క్రీమ్ తయారీకి పాలు, పంచదార, ఇంకా వారి వారి అభిరుచికి తగ్గిన పదార్థాలు కావాలి. వాటితో పాటు ముఖ్యంగా ఐస్‌క్రీమ్‌ తయారు కావాలంటే కావాల్సింది రిఫ్రిజిరేటర్. కానీ, ఇవన్నీ లేకపోయినా ఇక్కడ ఒక మహిళ చక్కగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చని నిరూపించింది. అదే వీడియోని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. వీడియోలో ఒక మహిళ ముందుగా పాలతో ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని తయారు చేసింది. కంప్లీట్‌ ఐస్‌క్రీమ మిక్స్‌ తయారు కాగానే స్టవ్ ఆపుచేసి..ఆ ద్రవ పదార్థాన్ని ఓ స్టీల్ క్యాన్ లో పోసింది. ఆ తరువాత ఓ బల్లపై అల్యూమినియం పాత్ర పెట్టి దానిలో ఈ స్టీల్ క్యాన్ ను కూర్చోబెట్టింది. చుట్టూ ఐస్ గడ్డలు వేసింది. స్టీల్ క్యాన్ హ్యాండిల్ కు తాడు కట్టేసింది. ఆ తాడు రెండో వైపున సీలింగ్ ప్యాన్ కు ముడేసింది. ఆ తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసింది. దాంతో ఫ్యాన్ వేగానికి కింద అల్యూమినియం పాత్రలో పెట్టిన స్టీల్ క్యాన్ తిరగడం ప్రారంభించింది. మెల్లి మెల్లిగా ఫ్యాన్‌ స్పీడ్‌ పెంచుతూ పోయింది. ఈ వేగానికి లోపలున్న మిశ్రమం, చుట్టూ ఉన్న ఐస్ ప్రభావానికి గట్టి పడుతుంది. అలా చూస్తుండగానే కమ్మటి ఐస్‌ క్రీం తయారైపోయింది. దాన్ని గాజు కప్పులో వేసుకుని సప్లై చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోని ఆనంద్‌ మహీంద్రా తన ట్విట్టర్‌ పేజీలో పోస్ట్ చేశారు. వీడియోకి ఆసక్తికర క్యాప్షన్ కూడా ఇచ్చారు..‘‘కృత నిశ్చయం ఉన్న చోట కార్యసిద్ధికి కావాల్సిన మార్గం ఉంటుంది. హ్యాండ్ మేడ్, ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీమ్. ఓన్లీ ఇండియా’’ అని ట్వీట్ చేశారు. భారత్ లో మాత్రమే తయారయ్యే చేతితో, ఫ్యాన్ తో చేసే ఐస్ క్రీమ్ అన్నది ఆయన మాటల్లోని అర్థం. మహిళ ఐస్ క్రీమ్ తయారీ నైపుణ్యాలను నెటిజిన్లు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు. దాంతో వీడియో మరింత వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఒక మిలియన్ వీక్షణలు,  55k కంటే ఎక్కువ లైక్‌లతో వీడియో వైరల్‌గా మారింది.